కొంత మంది పురుషులు దాదాపు ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనాలనీ, అలా పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటానని భావిస్తుంటాడట. నిత్యం సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు కూడా చెబుతుంటారు. రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత జబ్బులు సైతం దరిచేరవని వారంటారు.
ప్రధానంగా 60 యేళ్లు దాటిన వారు కూడా రోజూ సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారంటారు. అయితే, కొంతమంది వివాహమైన 10 లేదా 15 యేళ్ల లైంగిక జీవితంతో సరిపెట్టుకుంటారు. పిల్లల పుట్టక ముందు భార్యలు బాగానే సహకరిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత భర్తకు దూరం జరుగుతూ ఉంటారు. భార్య అనాసక్తికి కారణాలు తెలుసుకోవడానికి భర్తలు వైద్యులను సంప్రదిస్తుంటారు.
వయస్సు మీద పడేకొద్దీ, పిల్లలు పుట్టిన తర్వాత సహజంగానే మహిళలకు సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. భార్య ప్రిమోనోపాల్‌ స్టేజీలోకి వెళుతోందా, పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుందని వారు సలహా ఇస్తున్నారు.
అదే సమయంలో భర్త కూడా తనలోని లోపాలను గుర్తించాల్సి ఉంటుంది. అంగప్రవేశం జరిగిన వెంటనే శీఘ్రస్కలనమవుతుందా? లేదా అంగస్తంభన సమస్య వల్ల భార్య ఏమైనా అసంతృప్తి చెందుతుందా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇలాంటి లోపాలేవీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే వైద్యుడిని కలిసి తగిన సలహాలు, సూచనలు స్వీకరించాలి.