కొంత మంది పురుషులకు చెంతనే చెలియ ఉన్నా అంగం గట్టిపడడంలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. లోలోనే లైంగిక వాంఛతో రగిలిపోతున్నా అంగం గట్టి పడక కుమిలిపోతుంటారు. నిజానికి, చాలా మంది పురుషులకు 40 యేళ్లు దాటిన తర్వాత లైంగికాసక్తి తగ్గిపోతుందని అంటారు. శృంగారం విషయంలో భార్య పూర్తిగా సహకారం ఉన్నప్పటికీ ఏవో సమస్యల కారణంగా అంగం గట్టిపడక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఏదో విధంగా సెక్స్‌లో పాల్గొనాలని తపన పడుతుంటారు.
ఆ సమస్యతో సెక్సాలజిస్టును కలిసి తమ సమస్యను చెప్పుకుంటారు. ఆ తర్వాత వారు ఇచ్చేమందులను వాడుతుంటారు. ఇలాంటి వారికి స్మోకింగ్ లేదా డ్రింక్ చేసే అలవాటు ఉండొచ్చు. సాధారణంగా మానసిక వ్యధ కారణంగా కలిగే ఒత్తిడి వల్ల సంభోగంపై ఆసక్తిని అది డామినేట్ చేస్తుంది. దీంతో అంగం గట్టిపడదని వైద్యులు అంటున్నారు. రతిక్రీడకు సిద్ధపడినప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాతంగా పడక గదిలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. సంభోగం చేయడానికి శక్తిని పెంచుకోవాలని మందులు వాడే బదులు ప్రశాంతమైన మనస్సుతో, శృంగార భావనలతో ముందుకు సాగాలని అంటారు.
పురుషుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అంగ స్థంభన సమస్యను ఎదుర్కోవడం సర్వసాధారణమైన అంశం. మానసిక ఒత్తిడి, అధిక మోతాదులో మద్యాన్ని స్వీకరించడం ఇంకా చెప్పాలంటే శృంగార భావనలు సంప్రాప్తించకపోవడం కూడా అంగస్థంభన సమస్యకు దారి తీస్తుంది. నిజానికి, దీనితో వయస్సుకు పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో ఏడు శాతం మందికి ఈ సమస్య తలెత్తే అవకాశం ఉండగా, అదే 50 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారిలో 18 శాతం మందికి ఈ సమస్య చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అంగస్థంభన సమస్యకు దారితీసే రెండు కారణాలను ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి శారీరకమైంది కాగా మరొకటి మానసికమైంది. అత్యధిక శాతం కేసులు శారీరకమైనవనే విషయం తమ పరిశీలనకు వచ్చినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. కానీ అంగస్థంభన సమస్యతో సతమతమయ్యే పురుషులు రతి క్రీడలో సుఖాల అంచును త్వరగా చేరుకోవాలని ఆదుర్దా చెందడంలో ఒత్తిడి లేదా ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. దీంతో సమస్య క్లిష్టమవుతుంది.
ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆపాదించుకోవడం ద్వారా అంగస్థంభన సమస్యకు దూరంగా ఉండవచ్చు. ధూమపానం, మధ్యపానాలకు స్వస్తి చెప్పడం, ప్రతిరోజు వ్యాయామం, కొవ్వు శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం ద్వారా సమస్యను కొని తెచ్చుకుకోండా జాగ్రత్త పడవచ్చు. మధుమేహ వ్యాధి ఉన్నవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.