•  

దంపతులిద్దరూ ఉద్యోగులైతే లైంగిక క్రీడ ఇలా...

Romance Tips For Working Couples
 
ఆధునిక జీవితంలో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గానీ వెళ్లడం లేదు. దాంతో ఉద్యోగాలు చేస్తున్న దంపతులు కార్యాలయాల్లో పనిచేసి ఇంటికి చేరుకునే సరికి ఉసూరుమంటున్నారు. ఇది వారి లైంగిక జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దాంతో రాత్రులు నిస్సారంగా గడిచిపోయే పరిస్థితి. అయితే, వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. లైంగిక జీవితాన్ని సారవంతం చేసుకోవడానికి కొన్ని మార్గాలను ఎంచుకుంటే సరిపోతుంది. వారాంతాల్లో రాత్రినే కాదు, పగటి పూటను కూడా వెలిగించే ఆలోచనలు చేయాలి. అటువంటి దంపతుల కోసం కొన్ని చిట్కాలు...క్యాండిల్ లైట్‌లో డిన్నర్రోజువారీ తీరిక లేని పనుల వల్ల రతిక్రీడకు సరైన సమయం దొరకదు. ప్రతి రోజూ ఉదయాన్ని లేవాలనే ఉత్కంఠతో సెక్స్‌పై మక్కువ తగ్గుతుంది. రతిక్రీడ పట్ల బద్దకం ఏర్పడుతుంది. దీనివల్ల పురుషుల్లో నిస్సృహ పెరిగి ఇరువురి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది. పురుషుల్లో టెస్టోస్టిరోన్ (సెక్స్ హార్మోన్) విడుదల ఉంటుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రతి అర గంటకో సారి పురుషులు సెక్స్ గురించి ఆలోచన చేస్తుంటారట. అందువల్ల స్త్రీ తన భాగస్వామిని సంతృప్తి పరచడానికి రాత్రివేళ క్యాండిల్ లైట్‌లో డిన్నర్ చేసే ఏర్పాటు చేస్తే తనలో కూడా లైంగిక వాంఛ ఉదయిస్తుంది.కలిసి స్నానమాచరించడంఒంటరిగా స్నానం చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలి. పూర్తిగా వారం రోజుల పాటు ఆ అవకాశం దక్కకపోవచ్చు. హడావిడిగా స్నానం చేసి, ఆఫీసుకు బయలుదేరే ఒత్తిడి ఉంటుంది. మీ భాగస్వామిని టవల్ తెమ్మనో, సబ్బు తీసుకురమ్మనో పిలిచి బాత్రూంలోకి లాక్కోవాలి. ఇటువంటి ఆశ్చర్యకరమైన రతిక్రీడ శృంగార జీవితాన్ని రసవంతం చేస్తుంది.సెక్సీ లింగరీకార్యాలయానికి వెళ్లడానికి దుస్తులు ధరించే ముందు సెక్సీ లింగరీని మీ భాగస్వామి ఎదుట ధరించండి. స్త్రీలు ఇలా చేసినప్పుడు అతనిలో కోరిక పుట్టి అంగం స్తంభిస్తే ఆ సమయాన్ని వాడుకోండి. మీ పనులను లైంగిక క్రీడతో ప్రారంభిస్తే రోజంతా ఎంత తాజాగా వెలిగిపోతుందో మీకు అనుభవం ద్వారా తెలిసి వస్తుంది.కలిసి సినిమా చూడండిరాత్రి పొద్దుపోయిన తర్వాత కలిసి సినిమా చూడండి. ఉద్యోగాలు చేసే దంపతులు సినిమాలు చూడకూడదని ఎక్కడా లేదు. మీకు ఇష్టమైన సినిమాలో, కార్యక్రమాలో టీవీల్లోనో, కంప్యూటర్‌లోనో చూస్తూ మెల్లగా ఒకరి కౌగిలిలోకి మరొకరు జారుకోవచ్చు. అలా తెలియకుండానే రతిక్రీడలో మునిగిపోయి మత్తులో నిద్రను ఆహ్వానించవచ్చు.

English summary
For working married couples, it becomes very difficult to have an active sex life. Only weekends are the days when they can enjoy sex whole day and night long. Many busy working professionals do not even get excited to have sex on weekdays. To make your night sexy by putting aside the work life will spice up your love life. Lets check out few sex tips for working couples.
Story first published: Tuesday, September 4, 2012, 11:43 [IST]

Get Notifications from Telugu Indiansutras