దేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు పెద్దలు. మితిమీరి ఏదీ చేయకూడదని అంటారు. ఈ సూత్రం రతిక్రీడకు, శృంగారానికి కూడా వర్తిస్తుంది. అతి శృంగారం వివిధ సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. శృంగారంలో పీకలోతు మునిగిపోయేవారిలో ఒత్తిడి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని పరిశోధకులు అంటున్నారు. సాధారణ స్థితిని దాటిపోయి, అవధులు లేని శృంగారంలో మునిగిపోయేవారు కొంతకాలానికి ఆత్మన్యూనతా భావాలకు లోనవడమేకాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారట.
సాధారణ స్థాయిని మించిన శృంగారంలో ఓలలాడేవారు, శృంగారానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప తమ సంబంధాలను పటిష్టపరచుకునేందుకు ప్రయత్నించరు. కేవలం శృంగార కాంక్షతోనే అవతలి వ్యక్తిని చూస్తుంటారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని యుహెచ్ మానసిక విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు వెల్లడించారు.
అంతేకాదు ఇటువంటి సమస్యలో పీకల లోతు మునిగిపోయినవారు ఒకరికంటే ఎక్కువ భాగస్వాముల ప్రేమకై పరితపిస్తుంటారు. ఈ ప్రవర్తన దాంపత్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి అతి శృంగార భావనలను మనసు నుంచి తొలగించే ప్రయత్నం చేయాలంటున్నారు. వైవాహికేతర సంబంధాలు, అనారోగ్యకరమైన సంబంధాలు సామాజిక సమస్యలనకు కూడా కారణమవుతున్నాయి.
మితిమీరిన శృంగారం అనే అంశంపై కొందరు విద్యార్థులను పరిశీలించారు. ఆ పరిశీలనలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు పరిశోధకులు. వారి ప్రవర్తనలో, ప్రత్యేకించి వారిలోని రొమాంటిక్ బంధాలు స్థిరంగా లేవు. హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మితిమీరిన శృంగార బంధాన్ని నెరపుతున్నవారిలో వారి బంధంపై నమ్మకం లేని స్థితిలో కొట్టుమిట్టాడటాన్ని గమనించారు.