దానివల్ల ఆందోళన కూడా పెరిగి పురుషులు శృంగారానికి కూడా దూరమవుతారు. అంగాన్ని లావుగా, పొడవుగా చేస్తామంటూ ఇచ్చే ప్రకటనలకు మోసపోతుంటారు కూడా. నిజానికి స్త్రీని సంతోషపెట్టడానికి పురుషాంగం సైజుతో సంబంధం లేదని మొదట గ్రహించాలి.
పురుషాంగం పొడవుగా, లావుగా ఉన్నవారు శృంగారంలో భాగస్వామికి ఎనలేని తృప్తిని కలిగిస్తారా అనే విషయాన్ని పక్కపెట్టడం మంచిది. అంగ పరిమాణం చిన్నదిగా ఉంటే సుఖపెట్టలేరా అనే విషయంపై మథనం చెందాల్సిన అవసరం లేదు.
వాస్తవాన్ని పరిశీలిస్తే - స్త్రీని సంతృప్తి పరచడానికి, పురుషాంగం పరిమాణానికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కువ సేపు సంభోగం చేసేవారి పురుషాంగం చిన్నదిగా ఉండొచ్చు. తక్కువ సేపు సంభోగం చేసే వారి పురుషాంగం పెద్దదిగా ఉండొచ్చు. పురుషునిలో సెక్స్ సామర్ధ్యం అతనిలోని హార్మోన్లు, గ్రంథులపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలలో కూడా ఇదే విధంగా ఉంటుంది.
స్త్రీపురుషుల మధ్య ఆకర్షణను రేకెత్తించటంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అదే విధంగా శరీరంలోని సంబంధిత గ్రంథులు కోర్కెలను మరింత ప్రభావితం చేస్తాయట. ఏదేమైనప్పటికి పురుషాంగం పరిమాణానికి, సెక్స్ సామర్ధ్యానికి సంబంధమే లేదంటున్నారు నిపుణులు.
కావాలంటే అంగం చిన్నదిగా ఉందని ఆందోళన చెందే పురుషులు కొన్ని చిట్కాలను ప్రయోగించవచ్చు. సుఖపెట్టే చిట్కాలు మీ వద్ద ఉన్నప్పుడు మహిళ అంగం సైజు గురించి ఆలోచించదు. ఆమెను సంతోషపెట్టే చర్యలు ఏమిటో మీరు గుర్తించాలి.
నిజానికి, అంగం సైజు పెద్దగా ఉంటే కొంత మంది మహిళలకు ఇబ్బంది కూడా కావచ్చు. యోనిలోకి అంగాన్ని చొప్పించి, రతిక్రీడ చేస్తున్నప్పుడు ఆమెకు నొప్పి కలగవచ్చు. ముఖరతికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. జి స్పాట్‌ను ప్రేరేపించడం, ఫోర్‌ప్లే చిట్కాలను ప్రయోగించి మీ మహిళను మీరు సంతృప్తి కలిగించవచ్చు.
పురుషాంగం సైజు విషయంలో మరో అపోహ కూడా ఉంది. హస్తప్రయోగం చేసుకుంటే సైజు పెరుగుతుందని కొంత మంది అపోహపడుతుంటారు. కానీ అది నిజం కాదు. హస్త ప్రయోగం వల్ల రతిక్రీడను ఎక్కువ సేపు చేయడానికి వీలవుతుంది, అంగస్తంభన జరుగుతుంది. ఎక్కువ సేపు రతి చేస్తే మహిళ అంగం సైజు గురించి పట్టించుకోదు. మొత్తానికి, అంగ పరిమాణానికి, స్త్రీని సుఖపెట్టడానికి మధ్య ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని గ్రహించి వ్యవహరించాలి, మానసికంగా అందుకు సిద్ధపడాలి.