•  

పరాయి మహిళపై ఎందుకు ఆసక్తి?

Why Men shows interest on other Women
 
ఇంట్లో సౌందర్యం ఒలకబోసే కుందనాల బొమ్మలాంటి భార్య ఉన్నప్పటికీ చాలా మంది పురుషులు ఇతర మహిళలపై కన్నేస్తుంటారు. ఇది మానసికమైందా, లేదంటే మరేమైనా కారణాలున్నాయా అనేది ఆసక్తికరమైన విషయమే. వైవాహికేతర సంబంధాల పట్ల పురుషులు ఎక్కువగా ఉత్సుకత ప్రదర్శిస్తారని అధ్యయనాల్లో తేలింది. ఒక వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో 41 శాతంమంది భాగస్వాములు లైంగిక జీవనంలో వేరేవారితో సంబంధం కలిగి వుండటం లేదా తన భాగస్వామిని మోసం చేయటం వంటి చర్యలకు పాల్పడినట్లు తేలింది.అసలు ఒకసారి మరోకరకిని రుచి చూస్తే ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తి వల్ల కూడా పరాయి స్త్రీలతో సంబంధం ఏర్పరచుకుంటున్నారట. తమ వివాహ జీవితంలో భాధ్యతలన్ని బాగా నిర్వహిస్తున్నపుడు ఒకసారి బయటి సంబంధం రుచి చూస్తే ఏమిటంటున్నారు వీరు. పార్టీల్లో మజాలు, పీకల్లోతుకు తాగేయటం, పక్కలో పడుకునేవారెవరో కూడా పట్టించుకోకపోవడం. మహిళలు కూడా ఈ రకమైన రుచికి మరుగుతున్నట్లు చెబుతున్నారు.అయితే, ఈ అంశంలో మానసిక నిపుణుల అభిప్రాయం మేరకు, పురుషులు మొదటినుండి బహు భార్యలు కలవారే. తమ వివాహ జీవితంలో ఆనందం లేకపోవటం వలనో, వేరే ఇతర కారణాలవలనో పరాయి స్త్రీలతో పురుషులు ఇతర సంబంధాలు పెట్టుకుంటారని చెబుతారు. ప్రత్యేకించి పెద్దలు చేసిన వివాహాలలోని వారు, ఈ రకమైన మరో ఎంపికకు సిద్ధ పడతారు. ఆధునిక టివి లు, పురుషులు, స్త్రీల మధ్య సన్నిహిత్వం పెరిగిపోవటం, వంటివి, ఏడేళ్ళు గడిచే సరికి బోర్ కొట్టేయటం మరో భాగస్వామితో సంబంధం పెట్టుకోవడం వంటివి జరిగిపోతున్నాయి.కొంతమంది వివాహ జీవితం సంతృప్తిగా లేక సంబంధం ఏర్పరచుకుంటారు. మానసికంగా ఆనందపడతారు. తమ భార్యలతో అసలు ఏ రకమైన ఫిర్యాదు లేదని చెపుతారు. వారికి భర్త ఏమేమి ఇవ్వాలో అనన్ని ఇస్తున్నామని ప్రతివారు అందరిని వివాహం చేసుకోలేరు కనుక మరో మహిళను సెటప్ గా పెట్టుకొని ఆనందిస్తున్నామని వీరు భావిస్తారు. మరి కొందరు మహిళలు భర్త అంటే ప్రేమే కాని అతనికి మగతనం తక్కువైన కారణాన మరో మగాడ్ని వుంచుకోవాల్సి వస్తోందంటారు.మరికొందరు, తెలియని వారితో సెక్స్ మహా ఘాటుగా చేసేయవచ్చు. అందుకనే మరొకరు. అంటారు. జీవితంలో వెరైటీ మహా ఆనందం కలిగిస్తుంది. వివాహ జీవితాన్ని పాడు చేసుకోకుండా వెరైటీ రతి కొరకు సెట్ అప్ తో చెట్టాపట్టాలు వేసే వారు కూడా లేకపోలేదు. మరి నేడు తాజాగా ఆచరించబడుతున్న ఓపెన్ మ్యారేజీ వ్యవస్ధలో పరిస్ధితులు వేడెక్కి చేతులు జారకముందే వాటిని వదిలేయటం కూడా చేయాలంటున్నారు.English summary
Several men shows interest on extra marital relations with other women. Various reasons are there for this tendency.
Story first published: Saturday, August 25, 2012, 13:29 [IST]

Get Notifications from Telugu Indiansutras