•  

సంభోగంలో సరదా, జీవితంలో పరవశం

Sex makes daily life pressure free
 
శృంగారంలో ఆనంద పరవశంలో మునిగి తేలే దంపతులు రోజంతా ఉల్లాసంగా, హాయిగా ఉంటారని మానసిక శాస్త్రవేత్తలు తేల్చారు. పని సామర్థ్యం కూడా పెరుగుతుందని, కార్యాలయాల్లో చేసే పనిలో సృజనాత్మకత వ్యక్తమవుతూ ఉంటుందని అంటున్నారు. సాధారణంగా శృంగారం సంతృప్తిగా అనుభవించిన పురుషుల్లో ఎలాంటి ఒత్తిడులు లేకుండా ఉత్సాహంగా, ఆనందంగా ఉండటాన్ని మనం కూడా గమనించవచ్చు.



అదే ఆడవాళ్ల విషయంలో విషయంలో ఇలాంటి సంఘటన అరుదుగా చోటు చేసుకుంటుంది. ఆడవాళ్ళలో కూడా శృంగారం అనేది శరీరానికి, మనసుకు సంబంధించింది. ఈ రెండింటినీ సంతృప్తి పరిచినపుడే ఆ మహిళ ఆనందం పొందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



అయితే, ఈ శృంగారం అనేది కేవలం భార్యాభర్తల మధ్య జరిగేదిగా ఉండాలి. అక్రమ మార్గాల ద్వారా పొందే శృంగారంలో ఆనందం కన్నా ఆందోళన, గిల్టీ ఫీలింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. శృంగారంలో ఆనందం పొందిన స్త్రీలు రోజంతా ఆనందంగా ఉండగలుగుతారని వైద్యులు చెపుతున్నారు.



ఈ ప్రభావం దైనందిన జీవితంలో అన్ని విషయాలపై కొట్టొచ్చినట్లు కనబడుతుంది. శృంగారంలో తృప్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆందోళన తగ్గిస్తుంది. ఉద్యోగం చేసేవారిలో కూడా సంతృప్తికరమైన వైవాహిక జీవితం ఉన్నప్పుడు, ఉద్యోగంలో వచ్చే అనేక రకాల ఒత్తిడులను అధిగమించగలుగుతారట.



మరో రకంగా, సెక్స్‌ అనేది ఒక నిద్రమాత్ర లాంటిది. కాఫీ లాంటిది. అలసటను, ఆందోళనను తగ్గించి సుఖవంతమైన నిద్రను కలిగిస్తుందని చెపుతున్నారు. రోజంతా ఉత్సాహాన్నిస్తుందని చెపుతున్నారు. అలిసిన శరీరానికి సెక్స్‌ మందులా పనిచేస్తుందట. రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ను దూరంగా ఉంచవచ్చు అన్నట్లే రోజూ భావప్రాప్తి కలిగితే ఆరోగ్యం బాగుంటుందని సెక్స్ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.



English summary

 According to experts - the healthy ramanve and sex will decrease the pressure levels at work place in day time. Those woman or man get satisfied with the sex will work creatively.
Story first published: Tuesday, August 21, 2012, 15:02 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras