•  

పాఠకుడి ప్రశ్న: తొలి రేయి సెక్స్ చేయవచ్చా?

"మొదటి రాత్రి సెక్స్ చెయ్యొచ్చా, లేకుంటే వీడికి చాలా తొందరగా వుందని అనుకునే అవకాశం ఉందా?" ఓ పాఠకుడు అడిగాడు. నిజానికి, ఇటువంటి సందేహాలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. తొలి రేయి సమీపిస్తున్న కొద్దీ ఆందోళన పెరిగి పోతుంది. ఆ ఆందోళనతో మొదటి రాత్రిని చెడగొట్టుకునేవారు కూడా ఉంటారు. సందేహాలను తీర్చుకునే ప్రయత్నం చేసి, స్తిమితంగా వ్యవహరిస్తే తొలి రేయి జీవితంలోనే ఓ మధురమైన రాత్రిగా నిలిచిపోతుంది.



Question from reader on first night Romance
 



సెక్స్ సుఖం కోసం ఉవ్విళ్లూరే యువకులు తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తారు. అమ్మాయిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. పైగా, తొలిరేయి సెక్స్ చేస్తే వీడికి చాలా తొందరగా ఉందనుకుంటుందని బిడియం. అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయాలని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కనుక ఆ రాత్రికి వాటిని భరిస్తుంది.



తొలి రేయి వెంటనే సెక్స్‌లోకి దిగిపోతే ఆమెను అర్థం చేసుకునే అవకాశం కూడా చిక్కదు. మానసికంగా దగ్గరైతే కానీ శారీరకంగా దగ్గరవడానికి స్త్రీ ఇష్టపడదని అంటారు. పెద్దలు కుదిర్చే పెళ్లిలో ఒకరికొకరిని తెలుసుకునేందుకు అంతగా అవకాశం ఉండదు. కాబట్టి శోభనానికి ముందే భార్యభర్తలు ఒకరికొకరు కలుసుకుని, మనసు పంచుకునే అవకాశం ఇవ్వాలి. అలా మనసు పంచుకునే క్రమంలో తొలి రేయి సంభోగం జరగవచ్చు. అది యాంత్రికంగా కాకుండా ఒకరికొకరు మాటల్లోనూ చేతల్లోనూ క్రమంగా దగ్గరయ్యే పరిస్థితిని కల్పించుకోవాలి.



తొలి రేయి సెక్స్ జరగాలంటే...



తొలి కలయికపై ఉండే భయం వల్ల కొందరికి అంగస్తంభన కలుగదు. మరికొందరికి అంగం గట్టిగా లేచినా యోని ప్రవేశం జరుగదు. ఇక్కడ అబ్బాయి దోషం లేకపోయినా అమ్మాయిలో ఉండే భయ భ్రాంతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సెక్స్‌పై అపోహలే అందుకు ప్రధాన కారణం. నవ వధువుకు తొలి కలయిక బాధాకరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆమె మనసు సెక్స్ కు సమాయత్తమైతే యోని కండరాలు పట్టు వదిలేస్తాయి. యోని మార్గం వదులై పోతుంది. యోని వద్ద ద్రవాలు స్రవించి అంగప్రవేశం అవలీలగా జరుగుతుంది.



ఇటువంటి అనుకూల స్ధితి తొలి కలయికలో ఏర్పడాలంటే సెక్స్ లో పాల్గొనేముందు ఫోర్ ప్లే అవసరం. ఇద్దరూ టెన్షన్ కు దూరంగా ఉండాలి ఇది కూడా ఒక క్రీడ అన్న ఫీలింగ్ లోకి రావాలి. ఒకరి మీద ఒకరు అనవసర అనుమానాలు పెట్టుకోకుండా ముందుకు సాగిపోవాలి. ఆ సమయంలో ఇద్దరి మధ్య చక్కటి సంభాషణ ఉండాలి. నేరుగా సెక్స్ లో పాల్గొనకుండా ముద్దు ముచ్చట కొనసాగించాలి. పూర్తిగా వివస్త్రలైతే ఆ కొత్త దంపతులు ఆలింగనంతో ఒకటైతే శరీరాలు పులకరిస్తాయి. ఆ రెండు శరీరాల మధ్య బాడీ కెమిస్ట్రీ అద్భుతంగా పనిచేస్తుంది. పూర్తిగా వివస్త్ర కావడానికి అతను సిద్ధమే కానీ, ఆమెలో అలా కావడానికి ఎన్నో బిడియాలు. పూర్తిగా వివస్త్ర్రలు కాని కొత్త దంపతుల విషయంలో ఈ పులకింత, పరవశం తక్కువగా ఉంటాయి.



పరస్పరం అనుమానాలు లేకుండా ఆ రతి కార్యక్రమాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటే అన్నీ సజావుగా జరిగిపోతాయి. ఇద్దరు మన్మధ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత నిద్ర, మళ్ళీ అరగంటకు అదే సామ్రాజ్య ప్రవేశం. మంచం మీద మల్ల యుద్ధం...మళ్ళీ తెల్లవారు జామున అదే పని. ఇద్దరూ విడి విడిగా బ్రష్ చేసుకుంటూ ఉన్నా మళ్ళీ అవే ఆలోచనలు. బ్రేక్ ఫాస్ట్ అయినా ఆలోచనలకు బ్రేక్ ఉండదు. అదే తోలి రేయి మహత్మ్యం.



తొలి రేయి సెక్స్‌లో అమ్మాయి యోని రక్తమోడవచ్చు. నొప్పి కూడా ఉండవచ్చు. రక్తం ఓడడమనేది సహజమనే గ్రహింపు ఉండాలి. అలాగే, నొప్పి కూడా తీయగానే ఉంటుంది. నేరుగా సెక్స్‌లోకి వెళ్లితే ఇటువంటి అనుభవం చేదుగా ఉంటుంది. తర్వాతి సెక్స్ జీవితంపై దీని ప్రభావం పడుతుంది. అందుకని తొలిరేయి మధురంగా ఉండేలా జాగ్రత్తపడాలి.

English summary
A reply to a reader's question - When you have sex, you feel happy but also get tensed. This is more common among couples who are doing it for the first time. Why? Simply because there are many myths that can scare you and keep you in fear till you get your next period. Find out the most common myths that are related to first time sex.
Story first published: Thursday, August 30, 2012, 11:30 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras