రతిక్రీడ అనేది మీకు వెంటనే మీకు కావాలనిపిస్తుంది లేదా భయపడేలా చేస్తుంది. మీరు మొదటి తరగతికి చెందిన వారైతే, అందులో తప్పేమీ లేదు. మీరు సెక్స్ కు వాస్తవంగా రెడీగా ఉన్నారా లేదా అనేది మీకే తెలుస్తుంది. మరి అందుకుగాను మీకు కొన్ని లక్షణాలు కనపడతాయి. అవేమిటో పరిశీలిద్దాం. మీరు రతికి రెడీ అని తెలిపే లక్షణాలు!
సంశయం లేకుండా.....పురుషుడు లేదా స్త్రీ రోజుకు కనీసం ఒకసారికంటే కూడా అధికంగానే రతి గురించి ఆలోచిస్తారు. చాలా స్టడీల మేరకు, పురుషులు మహిళలకంటే కూడా రతిపట్ల 15 రెట్లు అధిక ఆలోచన చేస్తే, మహిళ మాత్రం రోజుకు 5 సార్లు మాత్రమే ఆలోచిస్తుందట. గతంలో మీకు రతి ఆలోచనలు లేవు. దానిని గురించి ఆలోచించటానికి కూడా ఇష్టపడేవారు కారు. కాని ఇపుడు ఏ సంకోచం లేకుండా ఆ ఆలోచనలు మీకు తరచుగా వచ్చేస్తున్నాయి. మీకు కనుక ఈ రకమైన ఆలోచనలు వస్తూంటే, మీరు మీ పార్టనర్ తో రతి చేయటానికి రెడీగా ఉన్నారన్నమాట.
కలలలో రతి - మీకు కలలలో రతి అయినట్లు, మీరు స్కలనం చేసుకున్నట్లు అనిపిస్తూంటే, స్కలనం అవుతూంటే, మీలోని టెస్టోస్టిరోన్ లేదా ఈస్ట్రోజన్ హార్మోన్ల స్ధాయిలు అధికంగా ఉన్నాయని మీరు రతి చేసేటందుకు రెడీగా ఉన్నారని భావించాలి.
సంకోచం లేని సౌకర్యం - మీరు రతికి సిద్ధంగా ఉన్నారా? అనే లక్షణాలలో ఇది చాలా ప్రధానమైన అంశం. మీ పార్టనర్ ముందు, ఏ రకమైన సంకోచం లేకుండానే మీరు నగ్నంగా తిరిగేస్తుంటే, ఆమెతో కలసి శారీరక ఆనందం పొందాలనుకుంటే, ఇక మీరు రతికి సిద్ధం అయినట్లే. అయితే, మీరు మీ పార్టనర్ గురించి కూడా బాగా తెలుసుకుని ఉండాలి.
కనుక మీరు వాస్తవంగా సెక్స్ చేయటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? అనేది నిర్ధారించుకోండి. రతిక్రీడకు సిద్ధమవ్వాలంటే ఒక వయసు ఉంటుంది. అంతేకాదు మీ పార్టనర్ లో కూడా మీకు తగిన విశ్వాసం ఉండాలి. అతడు లేదా ఆమె సరైన వారేనా అనేది తెలుసుకోండి. సెక్స్ గురించిన పూర్తి సమాచారం, ఆరోగ్యకరమైన సెక్స్ చేసేటందుకు ముందు జాగ్రత్తలు తెలుసుకోండి.
నేటి రోజులలో చాలామంది వారి సోషల్ సర్కిల్ లో తామున్నామని చెప్పుకోటానికి కూడా రతి ఆచరించేస్తారు. టీనేజ్ వారికి, యువతకు రతి అనేది పెద్ద సమస్య కాదు. కొన్ని సార్లు, స్నేహితుల ఒత్తిడితో లేదా వారు మోసగించటం వలన కూడా రతికి సిద్ధమైపోతారు. కనుక నిర్ణయం తీసుకునే ముందు మీరు మానసికంగాను, శారీరకంగాను సిద్ధంగా ఉన్నారా... లేదా అనే దానిని పై లక్షణాలవంటి వాటితో పోల్చి నిర్ధారించుకోండి.