•  

బాడీ మసాజ్‌తో శృంగారపుటంచులు తాకండి

రతిక్రీడ విషయంలో కోరికలు గుర్రాలై కామవాంఛ ప్రజ్వరిల్లడానికి ఇంద్రియ సంబంధంమైన బాడీ మసాజ్ బాగా పనికి వస్తుంది. దీంతో భాగస్వామిలో కోరికలు రేకెత్తింపజేసి ఆనందడోలికల్లో ఓలలాడేలా చేయవచ్చు. బాడీ మసాజ్ అనేది కేవలం రిలాక్స్ కావడానికి మాత్రమే కాకుండా రతిక్రీడను ఉరకలేయించేందుకు కూడా పనికి వస్తుంది. కొంత సృజనాత్మకంగా మీ జీవిత భాగస్వామికి సెక్సీ మసాజ్ రుచిని చూపించవచ్చు. మీ జీవిత భాగస్వామికి శృంగారాన్ని దీప్తిమంతం చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ చూద్దాం.



Give A Sensual Body Massage
 



వాతావరణాన్ని కల్పించడం



మెల్లగా, సుతిమెత్తగా ప్రారంభించాలి. మీ భాగస్వామి సానుకూల ప్రతిక్రియకు తగిన వాతావరణాన్ని కల్పించాలి. సువాసనలు గుభాళించే క్యాండిల్స్ వెలిగించండి. గదిలో సెంట్లు కొట్టండి. క్యాండిల్స్ మసక మసక చీకట్లతో వెలుతురును గదిలో పరిచే విధంగా చూడండి. చెవులకు మంద్రమైన శృంగార సంగీత సోకే ఏర్పాటు చేయండి. కొత్త పుష్పగుచ్ఛాలతో భాగస్వామిని గదిలోకి ఆహ్వానించండి. సువాసనల గుభాళింపు మీ జీవిత భాగస్వామిలో కామవాంఛ జనిస్తుంది.



దుస్తులను తీసేయండి



మీ భాగస్వామి స్వయంగా దుస్తులు విప్పేసేలా చూడకూడదు. మెల్లమెల్లగా మసాజ్ చేస్తూ దుస్తులు తీస్తూ పడకపై వాలిపోయి లైంగికోద్రేకం పెరిగేలా చూడండి. స్నానం చేయడానికి టవల్ ఇవ్వండి.



జీవిత భాగస్వామిపై పడకోండి



నిలబడి మసాజ్ చేయకూడదు. ఆమెపై లేదా అతనిపై వాలిపోతూ చమురు రాస్తూ మసాజ్ ప్రారంభించండి. మసాజ్ మృదువుగా ఉండేలా చూడాలి. రిలాక్స్‌గా మసాజ్ చేయడం వల్ల లెైంగిక సందేశం భాగస్వామికి అందుతుంది. చప్పగా ఉన్న వాతావరణం వేడెక్కుతూ పోతుంది.



పై భాగం నుంచి ప్రారంభించాలి



నేరుగా అసలు భాగాలకు వెళ్లకూడదు. మెల్లగా మొదలు పెట్టండి. ఇది లైంగిక వాంఛను క్రమంగా ఉద్దీపింపజేస్తుంది. సరైన మూడ్‌లోకి మీ భాగస్వామిని తీసుకుని వెళ్తుంది. మెడ, భుజాలు, ఇలా మసాజ్‌ను చేస్తూ పోవాలి. నేరుగా జననేంద్రియాలతో మొదలు పెడితే అంతా చెడిపోతుంది.



ఇంద్రియాలను మరిచిపోవద్దు



శృంగార ఉద్దీపనకు ఈ చర్యను విస్మరించకూడదు. శరీరంలో ఇంద్రియాలపై దృష్టి పెట్టండి. మెడ, తొడలు, నడుము వంటి శరీర భాగాలపై తొలుత దృష్టి పెట్టండి.



వెల్లకిలా తిప్పండి



సరైన లైంగిక వాంఛ ప్రకోపించిన వెంటనే జీవిత భాగస్వామిని వెల్లకిలా పడుకునే చేయండి. అప్పుడు రతిక్రీడను ప్రారంభించండి. ముద్దులతో ప్రారంభించి ముగ్గులోకి దింపండి.



బాడీ మసాజ్ శృంగార జీవితంలో అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుందనేది ఇప్పటికే మీకు అర్థమై పోయి ఉంటుంది. ప్రయత్నించి చూడండి మంచి ఫలితాలు వస్తాయి.



English summary
A sensual body massage would be a great way to spice up your sex life. Impress your partner in bed after a hectic day. A body massage is not just relaxing but also boosts up sex drive. Inspired from movies, and with use of little creativity you can try some tricks and steps to give a sexy massage to your partner. Check out some sensual tips to give the best body massage to your partner.
Story first published: Tuesday, August 14, 2012, 13:06 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras