అయితే, పురుషులకు సెక్స్‌కు సంబంధించిన ఫాంటసీలు స్త్రీ కన్నా ఎక్కువగా ఉంటాయట. అవి ప్రతికూలమైనవి కావచ్చు, సానుకూలమైనవి కావచ్చు. దానికి కారణం కూడా ఉందని అంటున్నారు. మహిళల కన్నా పురుషులు ఎక్కువగా సెక్స్ గురించి ఆలోచన చేస్తారని అద్యయన తేలుస్తోంది.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 2250 మంది స్పానిష్ ప్రజలను, తీసుకున్నారు. అందుకు 17 నుంచి 73 ఏళ్ల వయస్సు మధ్య వారిని ఎంచుకున్నారు. కనీసం వారంతా కనీసం ఆరు నెలల పాటు హెటిరో సెక్సువల్ సంబంధాలను కలిగి ఉన్నవారు. వారు ఆనందదాయకమైన సెక్సువల్ ఫాంటసీలోనే అనుభూతి చెందినట్లు వారంతా చెప్పారు. అయితే, ఫాంటసైజ్ ఫ్రీక్వెన్సీ విషయంలో మాత్రం తేడాలు ఉన్నాయి. పురుషుల కన్నా స్త్రీలు రోమాంటిక్ ఫాంటసీలను తరుచుగా అనుభూతి చెందినట్లు అధ్యయనంలో తేలింది.
సెక్సువల్ ఫాంటసీకి సంబంధించి స్పెయిన్‌లోని సానుకూల, ప్రతికూల ఆలోచనలపై జరిగిన మొదటి అధ్యయనం ఇది. ఈ అధ్యయన ఫలితాలు స్పానిష్ జర్నల్ డే సైకాలిజియాలో అచ్చవుతాయి.