శరీరం రతి అవసరం అంటూ ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేస్తాం. రోజువారి పని ఒత్తిడికి తలవంచేస్తాం. అయితే, ఆరోగ్యకరం, సంతృప్తికరమైన రతి తర్వాత ఎన్ని వ్యతిరేక సమస్యలు తీరిపోతాయో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి. రతి చేయాలంటే....ఇద్దరు అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా, హస్తమైధునం ఆచరించండి. శరీరం ఇచ్చే సంకేతాలు చూడండి.... నెర్వస్ గా భావిస్తూండటం.అనవసర ఆందోళన, మైగ్రేన్ తలనొప్పి, ఎపుడూ ఒత్తిడితో వుండటం, ఆకలి లేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం. కొంతమంది వ్యక్తులంటే చికాకు పడుతూండటం. తరచుగా లైంగికపర ఊహలు, ప్రత్యేకించి రాత్రులలో కలగటం. వాస్తవంగా, జీవితంలో రతి లేకుంటే సరిగా వివరించలేని అనేక వ్యతిరేక స్పందనలుంటాయి. శారీరక, మానసిక సమస్యలైన, చర్మం మంట, చికాకు, కోపం మొదలైనవి వస్తాయి. మీ పక్కనున్న వారిని సైతం కోపగించుకుంటారు.
మీ శరీరం ఇచ్చే ‘నాకు రతి కావాలి' సందేశాలను లేదా సిగ్నల్స్ ను ఒక్కసారి ఆచరించేస్తే, ఈ రకమైన భావనలు మీకు కలుగవు. ఎన్నాళ్ళు రతిలేకుండా వుండగలరనే బ్రేక్ వ్యక్తికి వ్యక్తికి మారుతూంటుంది. దాని కారణాలు వయసు, ఆడా, మగా, జీవన విధానం, శారీరక పరిస్ధితి, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, మొదలైనవాటిపై ఆధారపడి వుంటుంది. ఏది ఏమైనప్పటికి మీరు కొంత సమయంతీసుకొని మీ శరీర పరిస్ధితిని శ్రద్ధగా విని మీ అవసరాలు, కోర్కెలు తీర్చేస్తే, మరోసారి మీరు సరైన మార్గానికి వచ్చి ఎన్నో వ్యతిరేక భావాలనుండి దూరం అయి ఆనందిస్తారు.