ఒక్క సారిచేసే రతిలో ఆరోగ్యవంతమైన పురుషుడు షుమారుగా 40 మిలియన్లకు పైగా వీర్య కణాలను యోనిలోకి స్కలనం చేస్తాడు. కాని ఆమె గర్భవతి అవ్వాలంటే ఒక వీర్య కణం పురుషుడినుండి, ఒక అండం ఆమెనుండి కలిస్తే చాలు. ఆమె గర్భం ధరించి పిండం ఏర్పడి ఆ పిండం బిడ్డగా ఎదిగిపోతుంది. మరి పురుషుడు అన్ని మిలియన్ల వీర్య కణాలను ఎందుకు రిలీజ్ చేయాలి? వాటి అవసరం ఏమిటి? అనేది పరిశీలిస్తే...... సగటున పురుషుడు తన జీవితంలో షుమారుగా 525 బిలియన్ల వీర్య కణాలను ఉత్పత్తి చేసి ప్రతి నెలా షుమారుగా కనీసం అంటే ఒక బిలియన్ వీర్య కణాలను బయటకు వదిలేస్తాడు. కాని ఒక సగటు మహిళ షుమారుగా సగటున 2 మిలియన్ల అండ కణాలు మాత్రమే కలిగి ఉంటుంది. అవే ఆమెలో చివరకు అండాలుగా మారతాయి. యవ్వన దశ వచ్చిందంటే ఆ కణాలు అన్ని తగ్గిపోయి సుమారుగా 450 అండాలు మాత్రమేఏర్పడి ఫలదీకరణకు వస్తాయి. ఒక కొత్త రీసెర్చి మేరకు, అసలు సంభోగం మొదలైనప్పటిలో పురుషులు తమ వీర్యాన్ని మహిళ అండం వద్ద వదలటానికి ఎంతో పోటీలు పడేవారు. తమ వీర్యంతో ఆమెలోని అండం ఫలదీకరణ చెందాలని భావించేవారు.
ఈ రకమైన మగవారి పోటీ తత్వమే, జీవ జాలాన్ని అభివృధ్ధి పధంవైపుగా నడిపింది. తన ప్రత్యర్ధి వీర్య కణం కనుక అండాన్ని ఫలదీకరణం చేస్తే, తమ జన్యువులు ఒక అవకాశం పోగొట్టుకున్నట్లు భావించేవారు. తర తరాలలో అత్యధిక వీర్యం తయారు చేసి మహిళ అండం వద్ద వదిలిన వారి జన్యువులే మానవుల అభివృధ్ధికి కొనసాగేవి. తక్కువ వీర్యం తయారు చేసేవారు క్రమేణా జనాభానుండి తగ్గిపోయేవారు. కనుక అధిక వీర్యం తయారు చేసే స్తోమతు కల వారే పోటీలో వుండటం, మహిళలు వారిని మాత్రమే అధికంగా ఇష్టపడటం కూడా జరుగుతూండేది. నేటికీ అధిక సమయం లేదా ఎక్కువ సార్లు రతిలో ఆనందింప చేయగల పురుషుడిని మాత్రమే మహిళ తనతో సంభోగానికి ఇష్టపడటమనేది మనం గమనిస్తూనే ఉంటాం.
అయితే, అధిక సార్లు రతిక్రీడ ఆచరిస్తే చాలదు. లేదా పురుషుడి అంగం సైజు అధికంగా ఉన్నప్పటికిచాలదు. సంతానోత్పత్తికి అవసరమైనది వీర్యకణాల సంఖ్య. ఒకే రతిక్రీడలో గర్భవతులైన వారు ఎందరో ఉన్నారు. జీవ జాలంలో సైతం ఈన సంతానోత్పత్తి ప్రక్రియ ఇదే విధంగా కొనసాగుతోంది. మిలియన్ల సంఖ్యలో వీర్య కణాలు ఉత్పత్తి అయినప్పటికి అవి అండాన్ని చేరగలగాలి.వాటికి అండంతో సన్నిహితం అవటం ప్రధానం.
వీర్య కణాలు అండానికి అతి దగ్గరగా ప్రయాణించాలి. అండానికి దగ్గరగా ప్రయాణించే లోపే అనేక మిలియన్ల సంఖ్యలో వీర్య కణాలు చ్చిపోతాయి. చివరకు అండం ఉన్న ప్రదేశానికి చేరగలిగేది కొద్ది కణాలు మాత్రమే. అపుడే, అండం వాటిలోని ఒక్క వీర్య కణంతో సంయోగం చెందగలదు. దానినే ఫలదీకరణ అంటారు. ఈ దశ నుండి పిండం ఏర్పడి ఎదగటం మొదలుపెడుతుంది. సంతానోత్పత్తి ఏర్పడుతుంది.