అలాగే, మహిళలకు కూడా రతిలో సరైన భావప్రాప్తి లభిస్తే శరీరానికి, మనసుకు ఆనందాన్నిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శృంగారం అంటే సక్రమమైన శృంగారంగా వుండాలని, అక్రమ మార్గాల ద్వారా పొందే శృంగారంలో ఆనందం కంటే ఆందోళన, గిల్టీ ఫీలింగ్స్‌ ఎక్కువగా ఉంటాయని వారు చెపుతున్నారు. అందుకే భర్తతో లేదా తనకు ఇష్టమైన పురుషుడితో ఏకాంతంగా శృంగారం పొందిన స్త్రీలు రోజంతా ఆనందంగా ఉంటారని వారు చెపుతున్నారు.
ఈ ప్రభావం రోజువారీ జీవితంలో అన్ని విషయాలపై కొట్టొచ్చినట్లు కనబడుతుందట. ఈ తరహా రతి క్రీడ తృప్తితో పాటు.. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందని చెపుతున్నారు. అలాగే, ఆందోళన తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. ఉద్యోగం చేసేవారిలో కూడా సంతృప్తికరమైన వైవాహిక జీవితం ఉన్నప్పుడు, ఉద్యోగంలో వచ్చే అనేకరకాల ఒత్తిడులను అధిగమించగలుగుతారని పేర్కొంటున్నారు.
పైపెచ్చు.. సంతృప్తికరమైన సెక్స్ మహిళలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని, యోని కణజాలాల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని, మూత్ర మార్గానికి సంబంధించి వ్యాధులు లేకుండా చేస్తుందని, దీర్ఘకాలపు నొప్పులతో బాధపడేవారిలో చక్కని రతిక్రీడ తర్వాత అరగంట వరకు నొప్పులకు కాస్త ఉపశమనం కలుగుతుందని వారు చెపుతున్నారు. అలాగే, మెన్సెస్‌ సమయంలో వచ్చే నొప్పులు కూడా భావప్రాప్తి తో తగ్గుముఖం పడతాయని, ప్రసవ సమయంలో కూడా భావప్రాప్తి వల్ల కొన్ని మానసిక ఉపయోగాలుంటాయని చెపుతున్నారు.
భార్యాభర్తల మధ్య జరిగే సెక్స్‌ అనేది ఒక నిద్రమాత్ర లేదా ఓ మంచి కాఫీ లాంటిదని, ఇది అలసటను, ఆందోళనను తగ్గించి మంచి నిద్రను ఇస్తుందని చెపుతున్నారు. అలాగే, రోజంతా ఉత్సాహాన్నిస్తుందట. అలసిన శరీరానికి సెక్స్‌ మందులా పనిచేస్తుందని, రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ను దూరంగా ఉంచవచ్చు అన్నట్లే రోజూ భావప్రాప్తి కలిగితే ఆరోగ్యం బాగుంటుందని ఈ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు చెపుతున్నారు.
అంతేకాకుండా, సెక్స్‌ అన్నది భార్యాభర్తల అనుబంధాన్ని పెంచుతుందట. వీరిలో పాజిటివ్‌ ఫీలింగ్స్‌ను పెంచి, సంతృప్తికరమైన సెక్స్‌ జీవితంలో భార్యాభర్తల్లో ఒకరంటే మరి ఒకరికి నమ్మకం పెరుగుతుందని, ఇరువురిలో ఎవరికీ అనుమానాలకు తావు లేకుండా చేస్తుందని, మరింత అనుకూల దాంపత్యానికి దోహదం చేస్తుందని తెలిపారు. కాకపోతే తనకు సెక్స్‌ కావాలని భర్తకు ఎలా తెలియజేయాలి అన్నదే చాలామంది స్త్రీలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యగా గుర్తించినట్టు వారు చెప్పారు. అయితే కొందరు తెలివైన మహిళలు మాత్రం తమకు సెక్స్ కావాలని ప్రత్యక్షంగా అడగ పోయినప్పటికీ.. వివిధ రకాల హావభావాల ద్వారా కొంతమేరకు వ్యక్తం చేస్తుంటారని పరిశోధకులు వెల్లడించారు. అందుకనే యుగాలు గడచినా పురుషుడు మహిళ మనసు తెలుసుకోలేకుండా ఉన్నాడు. అయితే, నేటి రోజుల మహిళలు రతిలో ఎంత అడ్వాన్స్ అయినప్పటికి వారి మనసులో ఏమున్నదనేది కూడా పురుషుడు తెలుసుకోలేకపోతున్నాడు. మహిళ అంటే మరి మిస్టరీనే అనుకోవాలి.