మీరు ఎంపిక చేసిన యువతి సెక్సీగా లేదా? సాంప్రదాయంగా వుందా? బయటకు కనపడే ఈ చిన్న విషయాలు రతిక్రీడలోని ఆమె అభిరుచులకు అడ్డంకులు కావు. వీటిని వదిలేసి అసలైన సన్నివేశాన్ని ఆలోచించండి. ఆ స్ధాయి వుందంటే....ఇక మీరాశించినవన్ని సమకూరినట్లే. ఆమె ఫ్యాషన్ తీరును మీరు మార్చగలరు. కాని ఆమెకుగల సహజగుణాన్ని మార్చలేరు.
ఆమె కళ్ళలోని కోరికల తీవ్రతను పసికట్టండి. కళ్ళతో మాట్లాడలేని మహిళ పడకలో వెనుకంజ వేస్తుంది. మహిళలు సమాజకారణాలుగా వెనుకంజవేస్తూనే తమ కళ్ళతో భావాలను పలికించేయటంలో అఖండులు. ఆమె చెప్పాలనుకునేదాన్ని అర్ధం చేసుకోవాలంటే మీరు కళ్ళ భాషను నేర్చుకోవాలి. దట్టమైన నలుపుగా వుండే ఆ రెండు కళ్ళు భవిష్యత్తులో మీకు అంతులేని కోర్కెలుకల రాత్రులను అందిస్తాయి.
పెళ్ళికి సంబంధించినంతవరకు బయట కనపడేది ప్రాధాన్యత కాదు. మీ అభిరుచికి తగినట్టు వుందా లేదా అని చూసుకోటానికి ఆమె చూసే చూపు చాలు. ఎంతో ఆర్భాటంగా పెళ్ళి చూపుల్లో కనపడే మహిళలు రతిక్రీడ వద్దకు వచ్చేసరికి చల్లబడి తాము ఆసమయంలో అక్కడుంటే చాలులే అనుకున్నట్లు ప్రవర్తిస్తారు. కాని మీరు అలా వదిలేయరాదు. రతిక్రీడకు కూడా మీరు మీ వర్క్ లైఫ్ లో ఎంత ప్రొఫెషనలిజం చూపుతారో అంతే స్ధాయిలో ప్రణాళికలు చేసి మీ ఆనందాన్ని అన్నివిధాలా తారాస్ధాయికి చేర్చాలి. ఇక మేము తెలిపిన జిమ్మిక్కులు ప్రయోగించండి. మీరు ఎంపిక చేసే యువతి పక్కలో పిడుగా ? కాదా ? అనేది తేల్చుకోండి!