•  

ఒక్క రాత్రి పొందు....జీవితాంతం మందు...?

 Why One-Night Stands Are a Bad Idea!
 
ఎక్కడో అక్కడ ఒక్క రాత్రి ఆమెతో గడిపేసి ఆనందించేస్తే పోలా? అనుకునేవారు దీనిని తప్పక చదవాలి. ఆనందం అనుకుంటూ రెడ్ లైట్ ఏరియాలలో లైట్ ఆర్పి అనుభవించేస్తే, దాని ఫలితం మిమ్మల్ని జీవితాంతం సుఖవ్యాధుల రూపంలో వెంటాడుతూనే వుంటుంది. సురక్షిత సెక్స్ నుండి సుఖ వ్యాధులవరరకు మరియు మీ ప్రస్తుత పార్టనర్ గత లైంగిక జీవితం వంటివన్నిటితోబాటు, ఎక్కడో అక్కడ ఒక్క రాత్రి ఆడించేద్దాం లోని సమస్యలు ప్రతి ఒక్కరూ తెలుసుకొని వుండాలి. అవసరం అనుకుంటే మీ స్నేహితులనుండి సైతం అనుభవాలను సేకరించండి. ఒక్కరాత్రి ఆనందం......లోని సమస్యలు ఎలా ఉంటాయో చూడండి.

వ్యభిచార గృహం అంటే, వేదనలకు నిలయం అని తెలుసుకోండి. సుఖ వ్యాధులేకాదు, మందు, మనోవేదన వంటివి కూడా ఈ ఇండ్లలో కాపురం చేస్తాయి. త్వరిత సుఖం మనో వేదనకు గురి చేస్తుందనేది అనేక స్టడీలు తెలిపాయి. అంతేకాదు, భవిష్యత్ సంబంధాలను ప్రమాదంలో పడేస్తుంది. ఒక్కసారి మీ పార్టనర్ ను మోసగించి ఈ వ్యభిచారం చేస్తే, ఇక దానికే అలవాటు పడిపోతారు.కట్టుబాట్లు అనేవి ఒకసారి తెంచుకున్నారంటే, ఎంతో ఒత్తిడి పొందుతారు. వ్యభిచార కొంపలలో ఏ రకమైన కమిట్ మెంట్ మీకు వుండదు. ఏ బాదరబందీలు వుండవు కనుక ఎంతో ఒత్తిడి ఇద్దరికి ఉంటుంది. అటువంటి సంబంధాలు మిమ్మల్ని మానసికంగా బలహీనం చేస్తాయి. దీర్ఘ కాలంలో అసంతృప్తికర సంబంధాలకు దోవతీస్తాయి. మరి ఈ వ్యభిచార కొంపలలోకి కండోమ్ లేకుండా వెళితే....మీరు శారీరకంగా ఎంతో ప్రమాదంలో పడతారు. పురుషుడు, లేదా స్త్రీ తప్పక కండోమ్ ధరించాలి. దీనివలన, అవాంఛిత గర్భం లేదా సుఖ వ్యాధులు రాకుండా ఉంటాయి.వ్యభిచారంతోపాటు, ఆల్కహాల్ లేదా మత్తుమందులు కూడా కలిసినాయంటే, జీవితం నాశనమైనట్లే. ఆల్కహాల్, మత్తుమందులు, మీ లైంగిక అనుభవాలను చెడుగా చేస్తాయి. వాస్తవానికి అవి మీ విచక్షణను కూడా దెబ్బతీస్తాయి. మీ నిర్ణయాలను దెబ్బతీయటమేకాదు, మీ జీవన విధానాలను కూడా భ్రష్టు పట్టించి రోగాల బారిన పడేలా చేస్తాయి.English summary

 One night stands without condoms are a bad idea. There is some merit to the idea of carrying a condom with you whether or not you're accustomed to and expecting a one night stand. Man or woman, carrying condoms is a must if you want to avoid unwanted pregnancies or sexually transmitted diseases.
Story first published: Wednesday, June 27, 2012, 16:06 [IST]

Get Notifications from Telugu Indiansutras