ముద్దుకుగల ఎనిమిది వాస్తవాలు
1. ఒక్క నిమిషం పాటు ఘాటుగా పెడితే 26 కేలరీలు ఖర్చవుతాయి. కనుక జిమ్ అవసరం కూడా లేకుండా, రోజూ గట్టిగా ఒక ముద్దు పెట్టి బరువు తగ్గండి.
2. పురుషులు ముద్దు ఇచ్చేటపుడు 37 శాతం మంది కళ్ళు మూసుకోగా, 97 శాతం మంది కళ్ళు మూసుకొని ముద్దుపెడతారట.
3. ఒక ముద్దులో, పురుషులు ఊహించుకుంటారు. కాని మహిళలు మరింత కావాలనుకుంటారు.
4. పెదవులు గాఢంగా కలిశాయా వారి మధ్య అనురాగం అధికం. ఒకే రంగు జుట్టయినా మరింత ప్రేమ.
5. ఈజిప్టు ప్రజలు తమ పెదవులతో కాక, ముక్కులతో ముద్దాడుకునేవారట.
6. మధ్యయుగం నాటి ఇటలీలో, జంటలు ముద్దాడుకోవటం చూస్తేచాలు వారిని పెళ్ళికి బలవంతంగా ఒప్పించేవారట.
7. ముద్దు పెడితే....ముడుతలు రావనేది ఒక భావన. దానికి కారణం ముఖంలోని కండరాలు కిస్ చేసేటపుడు చాలా చురుకుగా వుంటాయట.
8. జపాన్, కొరియా, చైనా మరియు తైవాన్ దేశాల లో బహిరంగ ముద్దులు నిషేధించారు.
ఇవన్నీ కూడా ముద్దుగురించిన వాస్తవాలు. కనుక మరికనుండి రోజుకు మీరెన్ని ముద్దులు తీసుకుంటారు? ఎన్ని ఇస్తారనేది మీరే నిర్ణయించుకోండి. మీరు ముద్దు ఇస్తున్నారంటే అది మీకు మీ పార్టనర్ కు మధ్య గల సన్నిహితాన్ని పంచుతుంది. చాలామంది జంటలు అనుభూతితో ముద్దును ఆచరించలేరు.
చక్కని అనుభూతితో, మంచి విశ్వాసంతో, తాజా శ్వాసతో, మీకు ఎదుటివారితో వున్న అనుబంధం బట్టి పెదవులతో పెదవులు కలిపి, లేదా నుదుటిపైన లేదా ముఖంలోని ఇతర భాగాలపైన ఆనందంగా ముద్దాడి మీరు, మీతోపాటు ఆ ముద్దు పెట్టించుకునేవారు కూడా అనుభూతి చెందాలి. బలవంతపు ముద్దులు మీరంటే తిరస్కారం చూపుతాయి. ముద్దుకు సరైన భంగిమ అంటే, కొద్దిగా ముందుకు వంగండి, మీ పెదవులను మీరు ప్రేమించేవారి పెదవులు లేదా ఇతర భాగాలకు కలిపి ముక్కులు తగలకుండా అందించాలి.
చాలామంది జంటలు, ముద్దులిచ్చుకునేటపుడు కళ్ళు మూసుకుంటారు. ఇది వారిమధ్య కొద్దిగా వేడిపుట్టించి దగ్గర చేస్తుంది. కళ్ళు తెరచి కిస్ చేస్తే, మీ పార్టనర్ సిగ్గుపడటం, లేదా మీ రూపం చూసి భయపడటం కూడా చేస్తుంది. కళ్ళు మూసి కిస్ చేసినా, తెరచి చేసినా ఆ క్షణం మధురంగా వుండి భాగస్వాములు మైమరచిపోవాలి. అనుభూతితో పెట్టే ముద్దులు, మీజీవితంలో సంబంధాలను మరింత పెంచి బలపరుస్తాయనేది గ్రహించండి. ముద్దు పెట్టేటపుడు చేతులతో సైతం ఒకరినొకరు స్పర్శించుకుంటూ ఆనందించాలి.