రతిక్రీడ మానవులకవసరం. ప్రత్యేకించి వయసు పెరిగిన తర్వాత అది మరింత ఆనందం కలిగిస్తుంది. . కాని కుటుంబ పరిస్ధితులు మీరు ముసలి అయ్యారని, సెక్స్ కోరికలు అణచి వేస్తాయి. మన దేశంలో ముసలి వయసు వారు సెక్స్ చేయాలంటే సిగ్గుపడుతూంటారు. పెండ్లిండ్లు అయిన తమ పిల్లలు వీరికి సెక్సు పిచ్చ పట్టిందని భావిస్తారని తలపోస్తారు. దీంతో భార్యలు పూజలని, దేముళ్ళని, భర్తలు సోమరిగాను తయారవుతారు. లేదంటే, తీర్ధ యాత్రలు అంటూ వివిధ ప్రదేశాలను సందర్శించి తమ భావాలను మార్చుకుంటారు. కాని వయసుకు తగ్గట్లు మానవుడు కామ కలాపాలు సాగించాల్సిందే. చేసే లైంగిక చర్యలు అతనిని శారీరకంగాను, మానసికంగాను ఫిట్ గా వుంచుతాయి. కనుక శరీర అంగాలను ఉపయోగించటమా లేక వదులుకోవడమా అనేది ఇక మీ ఇష్టం.
శారీరక మార్పులు - మెనోపాజ్ దశలో తేమపుట్టించే కణాలు నశిస్తాయి. కనుక మహిళలు ఆసక్తి చూపరు.తేమ లేకుండా సెక్స్ చేయటం చాలా బాధాకరం. గర్భాశయం, అండాలు అన్నీ సైజు తగ్గుతాయి. కోరికలు తగ్గుతాయి. పురుషులైతే, 50 ఏళ్ళు పైబడితే అంగ స్తంభన సమస్యలు వస్తాయి. స్కలనం చాలా సమయం తీసుకుంటుంది. అంగం స్తంభించాలంటే సుమారుగా 12 నుండి 24 గంటలు కూడా పట్టవచ్చు. ఇంత సమయం పార్టనర్ సహకరించకపోతే, దానితో వారికీ ఆసక్తి తగ్గి ఇక హస్తమైధునానికి మొగ్గు చూపుతారు. అంగం స్తంభించే సమయానికి భార్య కనుక ఆసక్తి చూపకపోతే ఇక నిరాశే అతనికి మిగులుతుంది.
కనుక వయసు పైబడ్డ వారికి యోనిలో అంగప్రవేశం ప్రధానంకాదు. భావప్రాప్తి ఇతర మార్గాలలో అంటే కలసి వుండటం, లేదా స్పర్శించటం వంటి చర్యలలో కూడా పొందవచ్చు. పెద్ద వారైనప్పటికి క్లిటోరియస్ భాగంలో సున్నితత్వం అలానే వుంటుంది. ప్రయివేటు భాగాలను ఇరువురూ మాసేజ్ చేసుకోడం, లేదా నోటి సెక్స్ చేయడం, కలసి స్నానాలు చేయడం వంటివి సంతృప్తినిస్తాయంటారు నిపుణులు. లేదంటే, నేడు మార్కెట్ లో సక్షన్ పంపులు లభిస్తున్నాయి. డాక్టర్ సలహా పై వీటిని పొందవచ్చు. ఈ పంపును అంగంచుట్టూ పెట్టేస్తే స్తంభన సమస్యలుండవు. లేదా అంగం లోపల ఎలాస్టిక్ రాడ్ లు కూడా ఇంప్లాంట్ చేస్తున్నారు. స్తంభన సమస్యలున్నవారికి ఇవి బాగానే పనిచేస్తాయి.
లేదంటే వయాగ్రా వంటివి బయట లభిస్తున్నాయి. కాని వీటిని డాక్టర్ సలహాపై మాత్రమే వాడాలి. లేదంటే సమస్యలు వస్తాయి. మహిళలకు కూడా ఈ రకమైన టాబ్లెట్లు పరిశోధన చేస్తున్నారు.
చిన్న తనంలో సరైన జీవన విధానాలు పాటించకపోతే వయసు పైబడిన తర్వాత సమస్యలొస్తాయి. చిన్న వయసులో ఆహారం, వ్యాయామం వంటివి ఎంత వయసు వచ్చినా ఫిట్ గా వుంచుతాయి.
కీళ్ళ నొప్పులు, వెన్ను సమస్యలు, గుండె సంబంధిత సమస్యలున్నవారు రతిలో కొన్ని భంగిమలాచరించడం ద్వారా సెక్స్ ఆనందించవచ్చు. మీ ఆరోగ్య పరిస్ధితిని బట్టి ఏది సరైనదని నిర్ధారించేందుకు వైద్యుల సలహా పొందండి.