ఈ బంధం మరోమారు మీ వివాహ జీవితాన్ని గట్టిపడేస్తుంది. ఈ సారి ఇద్దరూ కలసి బిడ్డకు తల్లితండ్రులుగా మరింత భాధ్యతతో ప్రవర్తిస్తారు. మీ మధ్య అనురాగం మరింత బలపడుతుంది.
బిడ్డ కొరకు ఆందోళన చెందుతూ మీ అనురాగం ప్రేమలు దూరం చేసుకోరాదు. బిడ్డ కలిగి వున్నప్పటికి జీవిత భాగస్వామికి మొదటి స్ధానం వుంటుందని గుర్తించండి.
తండ్రి పరిస్ధితి
బిడ్డను కనాలంటూ ఆమె తొమ్మిదినెలలు దూరం వుండిపోయింది. డెలివరీ తర్వాత బిడ్డకు పాలు అంటూ మరింత బంధం బిడ్డతో పెంచుకొంది. మరి ఇక పురుషుడు ఆమెకు అప్పటికే దూరం అయ్యాడు. మరోపక్క బిడ్డ ప్రసవంతో అదనపు వ్యయం అతనిపై ఆందోళన. ఆమె అతనికి దగ్గరగా లేకపోవటం. ఇటువంటపుడు పురుషుడు తరచుగా బిడ్డను సందర్శించటం, అతనితో అనుబంధం పెంచుకోవటం, ఆమెపట్ల మరింత చేరువై యోగక్షేమాలు విచారించడం చేయాలి. గతంలో ఒక బిడ్డతో అనుభవం వుంటే, అతనికి కొంత ఊరటగానే వుంటుంది. బిడ్డపుట్టినందుకు ఒక వైపు ఆనందం, మరోవైపు ఆందోళన.
బిడ్డ పుట్టిన తర్వాత ఎన్నాళ్ళకు సెక్స్ చేయవచ్చు?
బిడ్డపుట్టిన తర్వాత వైద్య సలహా మేరకు ఆరు వారాలు ఆగాలి. తర్వాత వైద్య పరీక్షలు, సలహాలమేరకు తల్లి సెక్స్ ఆచరించవచ్చు. కాని అప్పటికి డెలివరీ కారణంగా యోని ఇంకా చాలా సున్నితంగానే వుంటుంది. సిజేరియన్ ఆపరేషన్ జరిగితే, మరిన్ని జాగ్రత్తలు సెక్స్ పరంగా తీసుకోవాలి. అయితే, భాగస్వామితో సంబంధం బలపడాలంటే రతిక్రీడ ఒకటే మార్గమని భావించకండి. లైంగిక చర్యలు లేకపోయినా, బేబీ గురించి తన పురుషుడితో ముచ్చటించటం వంటివి మహిళ చేయాలి. బేబీకి తండ్రికి మధ్య అనుబంధం బలపడేలా చూడాలి.
ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాడుకోండి. శారీరక స్పర్శలకు తహ తహ లాడుతున్నాట్లు తెలుపుకోండి. అతను పడే కష్టానికి మీరు త్వరగా కోలుకుంటానని తెలుపండి. అతనిని నిర్లక్ష్య పరచ లేదనే భావనగా కొన్ని అల్లరి మెసేజీలు పంపండి. మానసికంగా ఆనందించండి. బిడ్డ నిద్రించే సమయం మీ సరస సల్లాపాలకు ఉపయోగించాలి. అయితే, ఈ పరిస్ధితిలో కొంతమంది మహిళలు యోని పొడి బారి వుంటారు. అందుకుగాను పురుషుడు ఫోర్ ప్లే వంటి వ్యవహారాలతో కొంత సమయం కేటాయించి లూబ్రికేషన్ కలిగించాలి.
అందుకు అనువైన పరిస్ధితి ఏర్పరచాలి. ఆమె తాను అందుకు సిద్ధమేనన్న సందేశం అతనికి పంపాలి. ఎంతో సహకరిస్తూ లైంగిక చర్యలలో అతి సున్నితంగా పాల్గొని ఆమె శరీర కదలికలకు స్పందననివ్వాలి. మరోమారు ఆ జంట ప్రేమానురాగాలతో తల్లితండ్రుల భాధ్యతతో లైంగిక చర్యల పర్వం ప్రారంభించాలి. అవసరపడితే....ఆ జంట మరోమారు సెకండ్ హనీమూన్ చేయాలి.