లక్షణంగా పెళ్ళైంది. కాని పాత సంబంధం...గరల్ ఫ్రెండ్ వదలటంలేదే...! ఏ రోజు చూసినా పబ్ లు, రెస్టరెంటులు అంటూ జేబులు ఖాళీ చేయిస్తోంది. మరోవైపు మీకు సమాజంలో పెళ్ళి అయినప్పటికి అంటూ ....అనేక రిమార్కులు వస్తున్నాయి. అటువంటపుడు గాల్ ఫ్రెండ్ ని ఏ రకంగా వదిలించుకోవాలో చూడండి. సాధారణంగా గాల్ ఫ్రెండ్ ని వదిలించుకొని ప్రశాంతంగా వుండాలంటే, 5 బలమైన కారణాలుండాలి.
1. తిట్టిపోయటం లేదా నిందించడం- యువకులే కాదు, యువతులు కూడా తమ పనైపోయిందనుకుంటే నిందించడంలో మొదటి స్ధానాన్ని ఆక్రమిస్తారు. అవసరమైతే చేయి కూడా చేసుకుంటారు. సాధారణంగా పబ్ లలో యువతులు యువకులకు చెంప ఛెళ్ళు మనిపించటం చూస్తూనే వుంటాం కూడా. మీ గాల్ ఫ్రెండ్ కి ఈ స్వభావం వుంటే, అదే కారణంగా ఆమెను వదిలించుకోండి.
2. మితిమించిన ఖర్చులు - మోటర్ బైక్ లు, ఎక్కడెక్కడికో పిక్నిక్ లు. ఖర్చంతా మీదే. ఆమె పర్సులోనుండి సొమ్ము బయటకు తీయకుండా మీ జేబు ఖాళీ చేస్తోందా? అనవసరమైన షోకులకు పోయి, హై... గా భావిస్తూ మీ చేత ఖర్చు పెట్టిస్తోందా? ఆమె మెయింటెనెన్స్ మీకు అధికమైందా? ఇక ఆమెను వదిలించుకోడానికి ఇది సరైన కారణమే కాగలదు.
3. అక్రమ సంబంధం - ఆమెను మరొకరితో చూశారా? మీరు ఇటు రాగానే ఆమె మరొకరితో సంబంధం కొనసాగిస్తూంటే, మీకు ఎంతో అసహనంగా వుంటుంది. భరించలేని అవమానంగా కూడా వుంటుంది. సాధారణంగా గాల్ ఫ్రెండ్ తో వుండే సమస్య ఇది. ఆమె మిమ్మల్ని మోసం చేస్తోందనుకుంటే వదిలించుకునే హక్కు మీకుంది. ఎన్నో అబద్ధాలు చెపుతుంది. సానుభూతి కోరుతుంది. ఈ రకమైన చర్యలు సహజంగా మహిళలకు వచ్చేస్తుంటాయి. ఎక్కడో కొద్ది మంది మాత్రమే నిఖార్సుగా తమ ఒకే సంబంధానికి అంటిపెట్టుకుని వుంటారు. కనుక ఈ కారణంగా అయితే మీరు కఠినంగా వ్యవహరించి వదిలించుకోవాల్సిందే. అది కూడా మీ వివాహ సంబంధం విచ్ఛిన్నం కాకముందే వదిలించుకోవాలి. ఇటువంటి మహిళలు భార్యా భర్తల మధ్య తగవులు పెట్టటానికి కూడా వెనుకాడరు.
4. అధికారం - అధికారం చెలాయిస్తున్నా లేక మిమ్మల్ని తక్కువ చేసి తన పెంపుడు కుక్కవలే చూస్తున్నా ...మగవాడు తమ వెనుక తిరగడం వారికి పుట్టుకతో వచ్చిన హక్కుగా వీరు భావిస్తారు. పనులన్ని లేదా అవసరాలన్ని మీరు ఆమెకు తీరుస్తున్నప్పటికి ఏ మాత్రం విశ్వాసం కలిగి వుండరు. అకారణంగా మీపై ఆధిపత్యం వహిస్తూంటారు. అటువంటపుడు ఆమెను వదిలించుకోడానికి ఇది మంచి కారణం.
5. ఆత్మహత్య బెదిరింపు - ఆమెతో మీరు చేసే ప్రతి వాదానా మిమ్మల్ని గాయపరుస్తోందా? ఆమెను కలిసినపుడల్లా, నేను చస్తానని బెదిరిస్తోందా? ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదో ఒకరకంగా కట్టిపడేయటానికి వేసే జిమ్మిక్కులు. ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నపుడు, మీరు నిజంగా దూరంగా వుండవలసిన అవసరం వుంది. వెంటనే ఆమెను వదిలించుకోండి.
ఈ సమస్యలు మీ సంబంధాలలో కనపడితే, గాళ్ ఫ్రెండ్ ని తప్పక వదిలించుకోవాల్సిందే.