•  

మహిళ కోరేది....పురుషుడు పాటించాల్సింది!

8 Things Women Really Want From Men!
 

మహిళలను సర్వ సాధారణంగా చూడటం ప్రమాదకరం. మరి వారిని ప్రత్యేకంగా చూడటం మరింత ప్రమాదకరం కూడాను అని సామెత. నేటికి, అసలు మహిళకు ఏం కావాలనేది ఈ ప్రపంచానికి తెలియటం లేదు. అంత మాత్రం చేత పురుషులు ఏదో కొల్పోయినట్లు భావించాల్సిన అవసరంలేదను. మహిళ మనసు ఎంతో నిగూఢం.అందులో ఏం వుందనేది అది ఎపుడు ఎలా మారుతుందనేది ఎవరికి తెలియనిది. ఆమె పురుషులతో ఎపుడు ప్రేమలో పడుతుందో, ఎపుడు ఆ పురుషుడికి విడాకులిచ్చి దూరం చేసుకుంటుందో ఎవరికి తెలియదు. మరి ఆమెను ఎల్లపుడూ సంతోషంగా వుంచుతూ మీ పక్కనే కట్టి పడేయటానికి మీరు ఏం చేయాలి? ఎలా ఆమెతో ప్రవర్తించాలి? కొన్ని చిట్కాలు చూడండి.

సూపర్ మాన్ - మహిళలు, పురుషులు తమను రక్షించాలనుకుంటారు. తాము తెచ్చిపెట్టుకొనే వివాదాలకు పురుషుడు రాజీ చేయాలనుకుంటారు.కనుక మీరు ఆమెను రక్షించగలిగేవారు అనేందుకు కొన్ని చర్యలు చేపట్టండి. మీరు ఆమె పట్ల చేసే ప్రతి చర్య ఒక అవకాశంగా అందిపుచ్చుకోండి.

సువాసనలు - సెంట్లు, సువాసనలు వారికి చాలా ఇష్టమైనవి. వాటిని వారు వాడకం చేయటమే కాదు. మీరు వాడినప్పటికి అభినందిస్తారు. ఇష్టపడతారు. కనుక మీకు ఇష్టమైన సెంట్ ఏదో ఎంపిక చేసుకోండి. దానిని బాగా పట్టించి ఆమె వద్దకు వెళ్ళండి. అందులోనూ మొదటి సారి డేటింగ్ లో మీరు తప్పక సువాసనలు వెదజల్లాలి. అయితే, ముందుగా ఆమెకు ఇష్టమైన సువాసలేమిటో తెలుసుకోండి. దానికి అనుగుణంగా మీరు సువాసనలు వెదజల్లండి. ఇష్టంలేని వాసనలు, బ్యాక్ ఫైర్ అవుతాయని గుర్తించండి.

ఆశ్చర్య బహుమతులు - ఆశ్చర్య పడే రీతిలో ఆమె బహుమతులు కోరుతుంది. చాక్లెట్లు, ప్రేమ సందేశాలు, ఇతర బహుమతులైన బూకేలు వంటివి ఆమె అనుకోని విధంగా అందించేయండి. మహిళలు ఎన్ని ఇచ్చావనికాదు, ఎలా ఇచ్చావనేది పరిగణిస్తారు.

పారదర్శకత -మహిళలకు ఏ పని చేసినానీతి, నిజాయతీలతో చేయాలి. అవంటే వారు ఇష్టపడతారు. మీరు కనుక ఆమెతో కొంత కాలం బాగా సాగాలనుకుంటే, నిజాయతీగా వ్యవహరించండి. కొత్తల్లో మిమ్మల్ని ఒక అవాంఛనీయ వ్యక్తిగా చూసినా, కొంత కాలం అయ్యే సరికి ఆమె మీలోని నిజాయతీ గుర్తిస్తుంది.

మంచి సౌష్టవ శరీరం - సెలబ్రిటీల వంటి వారు సిక్స్ ప్యాక్ పొట్టలు కోరతారు. మరి తమ పురుషుడు కూడా చక్కని కండలు కల శరీరం కలిగి వుండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. కనుక మంచి వ్యాయామాలు చేసి శరీర సౌష్టవం కలిగి వుండండి.

దుస్తులు మంచివి ధరించండి - దుస్తులు సరిగా లేకుండా వుంటే మహిళపురుషుడిని ఇష్టపడదు. కనుక ఎప్పటికపుడు వచ్చే కొత్త ఫ్యాషన్లు ఆమెను మీకు దగ్గర చేస్తాయి. ఆచరించండి.

ఒక మహిళ మైండ్ పురుషుడి మైండ్ కంటే కూడా శుభ్రంగా వుంటుందనే జోక్ వుంది. అలా ఎందుకుంటుందంటే, ఆమె ఎప్పటికపుడు పురుషుడికంటే కూడా త్వరగా తన మైండ్ మార్చేసుకుంటుంది. మరి మహిళ మనసు ఎలా తెలుసుకోవాలి? అనేది ఎప్పటికపుడు పరిశోధించాల్సిన అంశమే.

English summary
Well, what women want still remains the unanswered question across the globe. However, men needn't lose hope for all is not lost. There are still a good number of things that most women like. Here are a few from the long list which can perhaps help you make her fall head over heels in love with you. Take your pick to woo and sweep her off her feet!
Story first published: Monday, June 4, 2012, 15:25 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more