•  

హనీమూన్ లో జంటలు మరువకూడని 5 వస్తువులు?

సాధారణంగా వివాహిత జంటలు తమ మొదటి హనీమూన్ అద్భుతంగా ఆనందించేయాలంటూ అన్ని ఏర్పాట్లూ చేసుకొని ఊటీ, కొడై లేదా మనాలి, సిమ్లా వంటి హిల్ స్టేషన్లకో లేదా మరికొన్ని అందాలను అందించే కాశ్మీర్ వంటి వాటికో వెళుతూ వుంటారు. తమ ట్రిప్ కు కావలసిన అన్ని వస్తువులూ తీసుకుంటారు. కాని వారు మరవకుండా తీసుకోవలసిన కొన్ని వస్తువులు వున్నాయి. వాటిని కనుక మరచిపోయినట్లయితే, వారి ఆనందం మరో రకంగా మారి వేరుగా వుండే అవకాశాలుంటాయి. మరి జంటలకు అంత ప్రాధాన్యతగల ఈ అయిదు వస్తువులు ఏమిటనేది ప్యాకింగ్ చిట్కాలు ఏమిటి అనేది
పరిశీలిద్దాం.



5 Things to Carry on a Romantic Vacation
 

1. అనుకోని బహుమతి - ఎపుడూ కూడా అనుకోని బహుమతులు ఎంతో సంతోషం కలిగిస్తాయి. అందులోనూ కొత్త జంటలకు ఒకరి కొకరు బహుమతులిచ్చుకోవడం ఎంతో మంచిది. వారి అనుబంధాన్ని, ఆనందాలను పెంచుతాయి. కనుక సెలవుల టూర్ లేదా హనీమూన్ ట్రిప్ వంటి వాటిలో మీ భాగస్వామి లేదా స్వీట్ హార్ట్ అకస్మాత్ గా చూసేలా ఒక మంచి బహుమతిని ఆమె తలగడకింద వుంచండి. మీ ఆనందం రెట్టింపవుతుంది. ట్రిప్ జాలీగా సాగిపోతుంది.

2. సెక్సీ లోదుస్తులు - మీకు కాదండోయ్....ఆమెకు. మీ ప్రేయసికి సెక్సీగా వుండే లోదుస్తులు కొని హానీమూన్ లో ఆమెను ఆశ్చర్యపరచండి. డిపార్ట్ మెంట్ స్టోర్ కు వెళ్ళి అక్కడి లేడీ సహకారంతో కొనుగోలు చేయండి. అందులోని మంచి చెడూ వారికే బాగా తెలుస్తాయి. ఈ లోదుస్తులలో మీ స్వీట్ హార్ట్ ని చూస్తే హనీమూన్ పడకలో మీ హార్మోన్లను పరుగులు పెట్టిస్తాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు.



3. కేండిల్స్ మరియు మ్యూజిక్ - ఇవి లేకుంటే మీ మధ్య అసలు కధ నడవదు. ఆమె మూడ్ రెడీ అయ్యేటంతవరకు వీటిని బయట పెట్టకండి. మూడ్ వచ్చిందంటే, లైట్లు ఆఫ్, కేండిల్ ఆన్, మ్యూజిక్ వీర బాదుడు. ఇక చూస్కో...అనండి. డ్యాన్స్ చేయండి, రెయిన్ లో తడిసిపొండి. మీ రొమాన్స్ నూటికి నూరు శాతం రొమాంటిక్ గా వుండేలా చూడండి.



4. కండోమ్ లు లేదా గర్భనియంత్రణ మాత్రలు - వీటి గురించి అతిగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఉపయోగం అందరికి తెలిసినదే. నేడు మార్కెట్ లో అధునాతనంగా వస్తున్న రుచి, వాసనలు గల కండోమ్ పేకెట్లు ఒకటి లేదా రెండు మరియు పిల్స్ వంటివి తప్పక తీసుకోండి. ఆమెకు ఏది సౌకర్యమో దానిని వాడి ఆనందించండి. కొంతమంది మహిళలు కండోమ్ ధరించేందుకు ఇష్టపడరు. అటువంటపుడు మార్నింగ్ పిల్స్ వంటివి వేస్తే అతి త్వరగా గర్భం రాకుండా కూడా వుంటుంది.



5. వ్యక్తిగత వస్తువులు - హనీమూన్ కు వెళ్ళినా, చాలా భాగం పడక గది తలుపులు వేసి లోపలే వుంటారు. కనుక మీ వ్యక్తిగత శుభ్రత, అలంకరణలు ఎంతో ప్రధానం. మీ, మీ ప్రేయసి అందాలను అతిగా పెంచేసే మేకప్ సామాగ్రిని కూడా తీసుకు వెళ్ళండి. లేదంటే మీ ప్రేయసి రాక్షసిగా కనపడితే....అంతా ఫెయిల్ అయి త్వరగా తిరిగి రావలసివస్తుంది.



English summary

 Personal Grooming items. Chances are you will stay indoors for long. Therefore, personal grooming is extremely important given your space constraints. Carry essential items and do what you wish, but don’t compromise on personal grooming.
Story first published: Thursday, June 21, 2012, 15:54 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras