ఎన్నో దశాబ్దాలనుండి మహిళకు రతిపరంగా క్లైమాక్స్ చేరాలంటే క్లిటోరియస్ పై ఒత్తిడి కలిగించటం మార్గంగా భావిస్తూ వచ్చారు. దీనితో పురుషులు తమ మహిళా భాగస్వామిలోని క్లిటోరియస్ అనబడే ఆభాగం కొరకు ఎంతో శ్రమించి దాని ఆచూకీ పట్టుకొని ఆమె ఆనందం ఏమో కాని వీరు దానిని ఒత్తిడిచేస్తూ ఆనందించారు.
అయితే, తాజాగా నిర్ధారించిన స్టడీలలో అత్యంత ఆనందం ఆమెకు ఇచ్చేది క్లిటోరియస్ ఒకటే కాదని, దానిని మించి అసలైన రతిక్రీడలోని అంగప్రవేశమని మరోమారు తేలింది. క్లిటోరల్ భావప్రాప్తి, యోని భావప్రాప్తి రెండూ కూడా వాస్తవానికి వేరు వేరు అనుభవాలని, అవి బ్రెయిన్ లో కూడా మహిళకు విభిన్న ప్రదేశాలను యాక్టివేట్ చేస్తాయని వెల్లడించారు. ఇంకా ఆశ్చర్యకరమైన వెల్లడి ఈ స్టడీలో ఏమంటే, మహిళలు తమ క్లిటోరియస్, లేదా యోని భాగాల స్పర్శ కారణంగానే కాక, దూరంగానే వుండి ఆ ప్రదేశాలపట్ల తీవ్రంగా తమకు అనుభూతి కలిగినట్లు భావించినా సరే వారికి బ్రెయిన్ లోని ఆ ప్రాంతాలలో ఆనందం కలుగుతుందట.
సున్నితమైన వీరి జి స్పాట్ ఒకప్పుడు మహిళల భావప్రాప్తికి కారణంగా భావించగా అది ఆమెకు కాన్పు సమయంలో నొప్పి తగ్గించే సాధనంగా వుంటుందని, యోనిద్వారా జరిగే భావప్రాప్తి శారీరకంగాను మానసిక ఆరోగ్యానికి తృప్తి కలిగిస్తుందని, క్లిటోరియస్ స్పర్శించకుండానే భావప్రాప్తి కలుగుతుందని కనుగొన్నారు. మహిళలోని యోని ముఖ ద్వారం క్లిటోరియస్ లోపలి భాగాలకు కలుపబడి వుందని కనుక క్లిటోరియస్ నొక్కకుండా యోనిలో చురుకు పుట్టించటం అసాధ్యమని తెలిపారు. కనుక ఇప్పటివరకు చెపుతున్న క్లిటోరియస్ భావప్రాప్తి వాస్తవంలో యోని లో కలిగే భావప్రాప్తి మాత్రమేనని రీసెర్చర్లు తెలిపారు.
న్యూజెర్సీ లోని రట్జర్స్ యూనివర్శిటీ రీసెర్చర్లు ఈ పరిశోధన నిర్వహించారు. వారు మహిళలను స్వయంమైధునం చేసుకోమని కోరి అపుడు వారి బ్రెయిన్ భాగాలను ఎంఆర్ ఐ మెషీన్లతో పరీక్షించారు. రట్జర్స్ విశ్వవిద్యాలయ సైకాలజీ ప్రొఫెసర్ బేరీ కోమిసరూక్ మేరకు క్లిటోరియస్, సెర్వికల్, యోని ప్రదేశాలు అన్నీ ఒక ద్రాక్షపండ్ల గుత్తిగా వుంటాయని, అయితే ఒకదానిపై మరొకటి పడివుండే అవకాశం వున్న కారణంగా వ్యత్యాసం తెలియదని తెలిపారు.
యోని కనుక క్లిటోరియస్ ను స్పర్శించటం ద్వారా చురుకు అయితే, బ్రెయిన్ లో కూడా ఒకే ప్రదేశంలో ఆమెకు స్పందన కలగాలని అయితే రెంటికి వేరు వేరుప్రదేశాలలో స్పందన కలుగుతోందని రీసెర్చర్లు వెల్లడించినట్లు డెయిలీ మెయిల్ పత్రిక పేర్కొంది. ఈ స్టడీ ఫలితాలు, సెక్సువల్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించారు.