పురుషులు రతిక్రీడ అంటే ఎంతో తేలికైన అంశంగా భావిస్తారు. తమ శారీరక కోర్కెలు తీర్చుకోవటం ప్రధానంగా భావిస్తారు. కాని రతిక్రీడ అంటే మహిళకు తన జీవితంలో ఒక భాగంగా భావిస్తుంది. దానికి ఆమె ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. రతిక్రీడలో ఆమె శారీరక సౌఖ్యమే కాక, తన మానసిక ఆనందం, తన పురుషుడితో సంబంధం, అతని సంతోషం మొదలైనవి కూడా ఆమె ఆలోచిస్తుంది. కొన్నిమార్లు వాస్తవంగా తనకు ఎట్టి ఆసక్తి లేకపోయినప్పటికి వివిధ కారణాలుగా పురుషుడితో రతిక్రీడకు తలపడుతుంది. సరైన అవగాహన లేకపోవడం వలన ఆమె తనకుగల కష్ట నష్టాలను గురించి పురుషుడికి తగిన రీతిలో వివరించలేదు.
సాధారణంగా మహిళలు తమకు రతిక్రీడ సమస్యలున్నట్లు ఏ పరిస్ధితులలో భావిస్తారో చూడండి
- అది వారి సంబంధాన్ని ప్రభావింపజేస్తుందనుకున్నపుడు
- ఆమె పార్టనర్ ఫిర్యాదు మొదలుపెట్టినపుడు
- ఆమెకు డిప్రెషన్ కలిగినపుడు
- ఆమె తనంతట తాను ఏదేని వివాహేతర సంపర్కంలో పడ్డపుడు
అయితే, ఆమె సమస్యలు వయసును బట్టి కూడా మారుతూంటాయి. చిన్న వయసు యువతులకు రతిక్రీడ సమస్యలు చాలావరకు శరీర రూపానికి సంబంధించినవై వుంటాయి. వారిలో ఎలా చేస్తామా? తమ అంగాలు సహకరిస్తాయా? ఏ రకంగా చేస్తే ఏ సమస్య వస్తుంది? అనే భయాలతో వుంటాయి.
మధ్య వయసు మహిళ అయితే
రతి అనేది ఆమెకు అలవాటుగా మారుతుంది లేదా ఎన్నో సంవత్సరాలనుండి చేస్తున్నందుకుగాను ఒక డ్యూటీలా అయిపోతుంది. అపుడు ఆమెకు నొప్పులు, భావప్రాప్తి జరుగకుండుట, ఇతర శారీరక సమస్యలు ఎదురవుతాయి.
ఈ మహిళలకు రుతుక్రమం ముందర మనో భావాలు తరచుగా మారి కోప తాపాలతో వుంటారు. అపుడు రతి అడిగితే, విరుచుకుపడతారు. అటువంటపుడు వారిని నిందించకండి...అంటారు గైనకాలజిస్టులు. ఈసమయంలో వారి సమస్యలకు సహకరించాలి.
ఆమెలో ఆసక్తి నశించిపోవటం సమస్యగా వుందా? రోజంతా ఫోర్ ప్లే కొనసాగించండి. ఇక రాత్రయ్యే సరికి ఆమెకు మూడ్ వచ్చే అవకాశం వుంటుంది. పెళ్ళి అయిన మహిళ ఇంటిపని, పిల్లలపని ప్రధానంగా భావిస్తుంది. పిల్లలతో వివాదాలు కూడా ఆమెకు భర్తతో గల సంబంధాన్ని ప్రభావిస్తాయి.
కనుక మీరు ఆమెను ప్రత్యేకంగాచూస్తున్నారనే భావన ఆమెకు బహుమతులివ్వడం, ప్రత్యేక ప్రోగ్రాముల ద్వారా కల్పించాలి.
శరీర రూపం సరిలేదనే భావన ఆమెను కించపరుస్తూంటుంది. తన శరీరం సరిగా లేకపోతే ఆమె సెక్స్ కు దూరంగా వుంటుంది. నీవు సరి లేవు అని పార్టనర్ అంటాడని భయపడుతుంది. అది ఆమె రతి జీవితాన్ని నెగిటివ్ గా ప్రభావిస్తుంది. కనుక మీ పిరుదులు వెడల్పు లేదా స్తనాలు చాలా చిన్నవి వంటి వ్యాఖ్యలు చేసి ఆమెను బెడ్ లోకి ఆహ్వానిస్తే, ఏదో ఒక సాకు చూపి తప్పుకుంటుంది. ఆమెకు మీరు మంచి విశ్వాసాన్ని కలిగిస్తే, ఆమె మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.
రతిక్రీడలో నొప్పి - కొంతమంది మహిళలు యోని సంబంధిత సమస్యల కారణంగా పురుషులు చేసే బలమైన రతి చర్యలకు నిలబడలేక రతికి తిరస్కరిస్తారు. ఈనొప్పి రెండు రకాలుగా వుంటుంది. అంగప్రవేశంలో కలిగే నొప్పి దీనిని క్రీములు, ఆయింట్ మెంట్ లతో లూబ్రికేషన్ కల్పించి సరిచేయవచ్చు. రెండవది యోని లోపల ఇన్ఫెక్షన్ల కారణంగా కలిగే నొప్పి. దీనిని సీరియస్ గా తీసుకొని తగినంత వైద్యం కూడా చేయించాలి.
శరీర వాసన - పురుషులు, మహిళలు ఇరువురికి శరీర వాసనలుంటాయి. ఏదేని ఇన్ఫెక్షన్లు కలిగితే వాటి సమస్య మరింత అధికం. మహిళకు రతి ఆసక్తి కలగాలంటే, పురుషుడు మంచి శరీరం కలిగివుండాలి. అంతే కాదు తన మహిళ మంచి శరీరం కలిగి వుండేలాగా కూడా ప్రయత్నం చేయాలి. అది బెడ్ లో ఆమె నుండి మంచి స్పందన కలిగిస్తుంది.
గర్భం వస్తుందేమో నన్న భయంతో ఆమె రతికి అంగీకరించదు. కనుక మంచి రతి క్రీడకు గాను ఇద్దరు పార్టనర్లు సరైన రీతిలో భాధ్యతగా గర్భ నిరోధక సాధనాలు వాడి రతిని ఆనందిస్తే, ఆమె కూడా అందుకు ముందుకు వస్తుంది.