రతి చర్యలో వేరే వారిని ఊహించుకోవడం చెడు
మీరు ఏ సంబంధం పెట్టుకున్నా ముందుగా ఇది నిజమా కాదా అని తెలుసుకోండి. రతి అనుభవం బ్రెయిన్ నుండి మొదలవుతుంది కాని అవయవంనుండికాదు. బ్రెయిన్ పని ప్రతి సెకండ్ తిరుగుతూ వుండడమే. సంబంధంలో కావలసింది...కట్టుబడి వుండటం అంటే కమిట్ మెంట్, అది కనుక సరిగా వుంటే, మీ భాగస్వామి బిపాసా బసు లేదా షారూఖ్ ఖాన్ వంటి వారిని గురించి బెడ్ లో ఆలోచించినా ఖంగారు పడకండి.
పురుషుడు రతిలో అంగం స్కలన సమయంలో బయటకు తీసేస్తే గర్భం రాదు
ఇది నిజంకాదు. పురుషులకు తమ స్కలనం ఎపుడవుతుందో తెలియదు. పురుషుడి అంగం నుండి ద్రవాలు ఊరుతూనే వుంటాయి. వీటిలో వీర్యం వుంటుంది. ఏ కొద్దిగా వుననప్పటికి అది మీ స్త్రీని గర్భవతిని చేస్తుంది.
పురుషులు ప్రతి ఏడు సెకండ్లకు సెక్స్ గురించే ఆలోచిస్తారు.
అసలు ఈ సంఖ్య ఎక్కడనుండి వచ్చిందో తెలియదు కాని అది వాస్తవం కాదు. అమెరికాలోని కిన్సీ ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన సర్వే మేరకు 14 శాతం పురుషులు ప్రతి రోజూ అనేక సార్లు, 43 శాతం నెలకు కొన్ని సార్లు లేదా వారానికి కొన్నిసార్లు, 4 శాతం నెలకు ఒకసారికి తక్కువకాకుండా సెక్స్ గురించి ఆలోచిస్తారని తేలింది. మహిళలలో 19 శాతం ప్రతిరోజూ అనేక సార్లు, 67 శాతం నెలకు లేదా వారానికి కొన్ని సార్లు, 14 శాతం నెలకు ఒకసారికి తక్కువకాకుండా ఆలోచిస్తారట. ఇక సంఖ్య ఎంత అనేదానికి స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేనని తేలింది.
యోని సెక్స్ కంటే, నోటి సెక్స్ మంచిది.
యోని లేదా జననాంగభాగాలకు సుఖవ్యాధులు రాకుండా బాగానే వుంటుంది. కాని నోటి సెక్స్ లో ద్రవాలు శరీరంలోకి ప్రవేశించి వ్యాధులు కలిగిస్తాయి.
పురుషులు సెక్స్ కు ఎల్లపుడూ సిద్ధమే
అది సరికాదు. పురుషులు రాబోట్లు కాదు. వారికి అలసట వుంటుంది. కొన్ని సార్లు వారికి అసలు మూడ్ వుండదు.
అంగాల సైజు బాగుంటే సుఖం ఎక్కువ
మహిళలు, ఎపుడూ రతిలో అంగాల సైజు గురించి ఆలోచించరు. వారికికావలసింది సమర్ధవంతమైన వారికి భావప్రాప్తి కలిగించే రతి కావాలి. కనుక ఈ విషయంలో పురుషులు తమ అంగం సైజు గురించిన అపోహలు తొలగించుకోవచ్చు.
ఎంత అసమర్ధుడికైనా వయాగ్రా బాగా పనిచేస్తుంది
వయాగ్రా కొన్నిసార్లు ఆశించిన మేరకు పనిచేయదు. పనిచేయటం మొదలుపెడితే, కణజాలం నష్టపోయేటంతవరకు కూడా అది మూడ్ ఇస్తుంది. కనుక మీ అసమర్ధతకు అసలు కారణం తెలుసుకొని సరైన చికిత్స పొందండి. వయాగ్రా వంటివి రక్తపోటు, డయాబెటీస్ కూడా తెప్పిస్తాయని గుర్తుంచుకోండి.
కొంత వయసు తర్వాత సెక్స్ అవసరం లేదు
ఇది సరికాదు. మీరు సెక్స్ గురించి పాజిటివ్ గా చేసే భావనలు మీ లైంగిక జీవితాన్ని పొడిగిస్తాయి. వయసు వస్తే, కోర్కెలు తగ్గటం సాధారణం. అయితే హార్మోన్లు, డిప్రెషన్, భాగస్వామితో సంభాషణ, ఆందోళన సమస్యలు వంటివి కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి.
పురుషులకు ఫోర్ ప్లేలో ఆసక్తి వుండదు
పురుషులకు స్కలనం తప్పిస్తే దేనిపైనా ధ్యాస వుండదు అని భావిస్తారు. కాని చాలా మంది పురుషులు స్కలనం మాత్రమే కాక తమ భాగస్వామి లైంగిక అవసరాలపై శ్రధ్ధ కనపరుస్తారని కూడా గ్రహించండి. వీరికి ఫోర్ ప్లే పట్ల కూడా ఆసక్తి వుంటుంది. అది ఒత్తిడిని దూరం చేస్తుందని భావిస్తారు. అంతేకాక తమ అంగస్తంభన నుండి అధిక సమయం దూరంగా వుండటానికి గాను ఫోర్ ప్లేని ఆశ్రయిస్తారు.