ఆనందకర రతి జీవితానికి వదలాల్సిన అలవాట్లు -
లేటుగా రావటం - ఆఫీస్ లో పని అధికంగా వుండవచ్చు. అలా అని మీరు మీ భార్యను మరచిపోనవసరం లేదు. పని ప్రేమిగా వుంటే అది మీ ప్రేమపూర్వక వివాహ జీవితానికి హాని కలిగిస్తుంది. బాస్ ను సంతోష పెట్టటమే కాదు మీ భార్యను కూడా సంతోష పెట్టాలి. ఇంటికి లేట్ గా వచ్చారా? వస్తూనే బుట్టెడు మల్లెలు తెచ్చి మీ భార్య మూడ్ సెకండ్లలో మార్చేయండి. దగ్గరగా వెళ్ళి మీ వేలి స్పర్శతో మేజిక్ చేయండి.
సెల్ ఫోన్ న్యూసెన్స్ - మీ డార్లింగ్ పక్కనుంటే ఫోన్ దూరంగా పెట్టేయండి. పురుషుడు లేదా స్త్రీకి ఇటువంటి సమయాలలో దీనిని మించిన శత్రువు లేదు. సరిగ్గా రతి సగంలో మీ ఫోన్ ఇక ఆపేయ్ అంటూ అలారం కొడితే....ఇద్దరి మూడ్ ఖరాబే. కనుక చక్కటి సుఖవంతమైన రతికై మీ ఫోన్ దూరంగా వుంచండి. ఆఫీస్ పని ఇంటికి తేకండి. మరీ అర్జంట్ కాల్ అయితే, తక్కువగా మాట్లాడి కట్ చేయండి.
నిద్ర - రతిలో మీరు వారానికి కనీసం 3 లేదా 4 సార్లు అయినా, చురుకుగా పాల్గొనాలి. రతి మీ ఒత్తిడి దూరం చేస్తుంది. అది కూడా ఒక ఆరోగ్యకర వ్యాయామమే. బరువు తగ్గిస్తుంది. విసుగెత్తించే మీ జీవితాలకు చక్కటి భంగిమలు ఆహ్లాదాన్నిస్తాయి. రతి తర్వాత వెంటనే గుర్రు మంటూ నిద్రించకండి. మీ మహిళను కౌగిలించి సంభాషించండి. మహిళలు దానిని కోరతారు.
స్నేహితులంటూ అధిక సమయం గడపకండి? స్త్రీలకు, పురుషులకు ఇదొక చెడు అలవాటే. మీ పార్టనర్ కు మించిన స్నేహితులు లేరు అనుకోండి. మీ స్నేహితుడితో బీర్ కొడుతూ కూర్చునేకంటే మీ భాగస్వామి వద్దే ఆపని చేయండి. వైన్ వంటిది కోరిక ఆమెలో కూడా రగిలిస్తుంది. కనుక ఈ డ్రింక్ తో మీ జీవితం ఆనందించండి. అదికూడా ఎపుడైనా ఒకసారి సిప్ చేస్తే మీ రతిలో టాప్ లేపుతుంది.
ఈ అలవాట్లు మార్చుకుంటే, మీ వైవాహిక రతిజీవితం అమోఘం, మరింత బాగుండాలంటే కొత్త భంగిమలు ఆచరించండి. మీ అలవాట్లతో ఆందోళన చెందేకంటే, మీ డార్లింగ్ ను బెడ్ లో ఎలా సంతోష పెట్టాలనేది ప్రధానంగా భావించండి.