గతంలో వారికన్నా వయసు మీరిన వారితో వారికి ఒత్తిడి అధికంగా వుండేది. అయితే నేటి పరిస్ధితులలో వారి సములే, వారి స్నేహితులే వారికి కాముకులై అందరూ కలసి తప్పుదోవలు పట్టేస్తున్నారు. ఈ అంశాన్ని ఎన్ ఎస్ పిసిసి తన నివేదికలో వెల్లడించింది. 18 సంవత్సరాలలోపు యువతులలో మూడు వంతులమంది ఈ రకమైన లైంగికపర సందేశాలు కలిగి వున్నారని, ఇ మెయిళ్ళ ద్వారా బూతు బొమ్మలు పంపి వారిపై ఒత్తిడి కలిగిస్తున్నారని సర్వే తెలుపుతోంది.
ఇదే రకంగా అంశం కొనసాగితే, వారికి వివాహ వయసు వచ్చే సరికి కోరికలు తీరిపోయి వైవాహిక సుఖ జీవనం తగ్గిపోతుంది. అతి త్వరగా వారు లైంగిక జీవితాలను ముగించేస్తారు. కనుక ఈ వయసు వారిలో కలుగుతున్న కోర్కెలకు సమాజపర భాధ్యత ఎంతో వుంది. లభిస్తున్న సమాచార సాధనాల కారణంగా వారిలో వారే కోర్కెలు కలిగించుకొని నిర్వీర్యులైపోతున్నారు. ఈ స్టడీని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు కింగ్స్ కాలేజ్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చర్లు నిర్వహించారు.
ఇంతవరకు టీనేజ్ పిల్లలుకు ఆన్ లైన్ లో వచ్చే అపరిచితుల లైంగిక చర్యలకు బలికాకుండా భధ్రతా చర్యలపై శిక్షణ నివ్వటం జరిగింది. అయితే, అయితే, ఇకపై టీనేజ్ పిల్లలకు తమ తోటి టీనేజ్ పిల్లల కారణంగా కూడా ప్రమాదం రాకుండా భధ్రత చర్యలు తీసుకోవలసిన అవసరం వున్నదని కింగ్స్ కాలేజ్ రీసెర్చర్ రోసాలిండ్ గిల్ పేర్కొన్నట్లు బిబిసి ప్రకటించింది.
ఇపుడు టీనేజ్ పిల్లలు వారిలో వారే ఈ రకమైన ప్రవర్తన అలవరచుకోకుండా చూడాల్సిన అవసరం వుందని రీసెర్చర్లు తెలుపుతున్నారు. ఈ రకమైన టీనేజ్ పిల్లల ప్రవర్తన ఆందోళన కలిగిస్తోందని వెలిబుచ్చారు. అయితే, చాలామంది ఈ టీనేజ్ పిల్లల లైంగిక చర్యలు జీవిత సహజమని కొట్టిపారేస్తున్నారని అది సరికాదని, లైంగికపర దుర్వినియోగం మరింత జరిగినట్లని, అది చట్టబద్ధం కానిదని వారు తెలిపారు.
35 మంది టీనేజర్లను లండన్ పాఠశాలలలో సర్వే చేయగా వారిలో 11 సంవత్సరాల పిల్లలు సైతం వారికి తెలిసిన మగ పిల్లలకు ఫొటోలు పంపినట్లు తెలిపారట. కొన్ని ఫొటోలపై ఆ బాలికలు, తమ శరీరాలను గుర్తించి ఆ భాగాలు, తమ మగ బాలురకు అవి చెందినవని గుర్తించారట. ఇక మగ పిల్లలనుండి అనేక అభ్యర్ధనలు రతిక్రీడకు లేదా ఓరల్ సెక్స్ కు రావలసిందని వచ్చాయట.
ఈ రకమైన సెక్స్ మెసీజీలు, సైబర్ నేరాలకింద వస్తాయని నివేదిక ముగించింది. ఈ స్టడీని హౌస్ ఆఫ్ కామన్స్ లో ఒక పార్లమెంటు సభ్యుడు ప్రవేశ పెట్టాడు.