మహిళకు అది ఆహ్లాదమా?
రుతుక్రమ సమయంలో పలువురు మహిళలు అయితే, తమ భర్తలను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోవాలని కూడా భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కాదని మగవారు భావిస్తుంటారు. అయితే, ఈ రుతుక్రమ సమయంలోనే స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతారు. వారికిగల మానసిక స్ధితి రతిక్రీడలకు అనుకూలించదు.
ఆమెకు విశ్రాంతి అవసరమా?
ఈ రకమైన భావోద్వేగాలతో పాటుగా, శారీరకంగాను వీరు అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. తీవ్రమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావం కారణంగా నీరసంలాంటివి ఉంటాయి. ఈ సమయంలో ఇంటి పని - వంట పనిలో భర్త షేర్ చేసుకోవడమే కాదు మానసికంగా కూడా ఆమెకు కొంత ప్రశాంతతను చేకూర్చాల్సిన అవసరముంటుంది. రుతుక్రమం జరిగే సమయంలో భార్యకు పూర్తి విశ్రాంతి ఎంతో అవసరం అని భర్త గ్రహించాలి. శారీరకంగా, మానసికంగా ఆమెకు సహకరించాలి.
శుభ్రత అవసరం ఎంత వరకు?
శుభ్రత ప్రధానం. ప్రతి ఒక్కరు తాము శుభ్రంగా వున్న పార్టనర్ తో నే సెక్స్ చేయాలనుకుంటారు. కనుక మంచి శుభ్రత అనేది లైంగిక భాగస్వామ్యంలో అతి ప్రధానం. మీ సెక్స్ పార్టనర్ అత్యంత హాయిని గొల్పేదిగా వుండాలి. శరీరం ఏ మాత్రం అస్వస్ధతగా వున్నా పూర్తి ఆనందం కొరవడినట్లే. కనుక మీ పార్ట్నర్ మానసికంగాను, శారీరకంగానూ ఫిట్ గా వుందో లేదో చూసుకోండి. ఆమె నుండి చెడు వాసన ఏదైనప్పటికి సెక్స్ ఆనందం ఇక ముగిసినట్లే.
వైద్యుల సలహా ఏమిటి?
ఉద్యోగం చేసే మహిళలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనైతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు. పైపెచ్చు.. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే అధిక రక్తస్రావంతో పాటు కడుపునొప్పి ఎక్కువ అవుతుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అందుకే నెలసరి సమయంలో శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.