ముద్దు ఇవ్వటం ద్వారా మహిళలు భాగస్వాములతో తమ బంధాన్ని పెంచుకోటానికి చూస్తారు. వారు తమకు అనువైన వారేనా అనేది కూడా అంచనా వేస్తారు. అయితే పురుషులు మాత్రం ముద్దును తమ భావావేశానికి ముగింపుగా భావిస్తారని ఇక ఆ ముగింపే రతిక్రీడకు దోవతీస్తుందని భావిస్తారని పెన్సిల్వానియా లోని ఆల్ బ్రైట్ కాలేజీ సైకాలజిస్ట్ సుసన్ హ్యూగెస్ వెల్లడించారు. పురుషులు తమ భాగస్వాములకు కోరిక కలిగించటానికి ముద్దు పెడతారు.
వీరు చేసిన పరిశోధనలో షుమారు వేయిమందికి పైగా పురుషులు, స్త్రీలు వున్నారు. వీరిలో కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్లు వుండి అందరూ యవ్వన దశలోనే వున్నట్లు తేలింది. పరిశోధనలో పురుషులు, మహిళలు ఇద్దరూ కూడా ముద్దును ప్రధానమైనదిగాను, అత్యంత స్నిహిత చర్యగాను భావించారు. ముద్దులో వారి భాగస్వాముల బలాబలాలు అంచనాలు వేశారు.
అయితే, ముద్దు పెట్టే అనుభవం ద్వారా వారి భాగస్వాములను అధికంగా కూడా ఆకర్సించారు. ఈ ముద్దు సమయంలో వారిలోని శారీరక రసాయనాలు ప్రధానమైనవి ఒకరినుండి ఒకరికి బదిలీ అవుతున్నట్లుగా గుర్తించారు. ముద్దు సరిలేదనుకుంటే, మహిళ సంబంధం తెంపుకోవాలనుకొనగా, పురుషుడు మాత్రం అది ఎలా వున్నా సరే రతికి సిద్ధం అనే రీతిలో వుంటాడట.
వాస్తవానికి మహిళలకంటే కూడా పురుషులు ముద్దు పెట్టటమనేది రతిక్రీడకు దోహదం చేస్తుందని బలంగా భావించారట.ముద్దు దీర్ఘకాల భాగస్వామిగాపనికివస్తుందని స్త్రీలు భావించగా పురుషులు తాత్కాలికంగా కూడా సరిపోతుందని భావించినట్లు రీసెర్చర్లు తెలిపారు. పురుషులకు ముద్దు పెట్టటంలో ఎంగిలిముద్దు ఇష్టపడగా, మహిళలు అటువంటి భావనకు దూరంగా వుండటానికి ఇష్టపడ్డారట. పురుషులు ముద్దు తడిగా, నోటి ఊటతో వుండాలని అది తన నుండి ఆమెకు బదిలీ కావాలని కూడా భావించినట్లు, కొద్దో, గొప్పో షుమారుగా రతిక్రీడ మాదిరిగా వుండాలని భావించినట్లు హ్యూగెస్ వెల్లడించారు.
2009లో చేసిన ఒక రీసెర్చిలో రట్జర్ యూనివర్శిటీ ఆంత్రపోలజిస్టు హెలెన్ ఫిషర్ ముద్దులోని లాలాజలంలో పురుషులు తమలోని టెస్టోస్టిరోన్ హార్మోన్ ను మహిళలలో అప్పటికపుడు రతి వాంఛలను పెంచటానికి ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ పరిశోధనా ఫలితాలను ఎవల్యూషనరీ సైకాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.