మహిళలలో లైంగిక వాంఛలు ఎపుడు కలుగుతాయనే అంశంపై వుమన్స్ హెల్త్ మేగజైన్ ఒకటి పరిశోధన వేసింది. ఈ పరిశోధనలో సుమారు వేయిమంది మహిళలనుండి సమాచారం రాబట్టారు.
ఇంగ్లాండ్ దేశంలో జనాభాలో షుమారు మూడు వంతులమంది పెద్దలు తమ లైంగిక జీవితాలలో సంతోషంగా వున్నప్పటికి వీరిలో చాలామంది తమకు మూడ్ రాకపోవటానికి కారణం, ఎంతో బిజీగా వుండే లైఫ్ అని, పని కారణంగా సమయం లేకపోవటమని తెలిపారు.
స్కాట్లాండ్ మహిళలు షుమారు 82 శాతం మంది తాము తమ లైంగిక జీవితాలలో పురుషులతో తృప్తి పడినట్లు తెలుపగా, షుమారు 30 శాతంమంది ఐరిష్ మహిళలు తాము కోరుకున్న రీతిలో పురుషులనుండి తమకు లైంగిక వాంఛలు తీరటంలేదని తెలిపారు. వీరు అపుడపుడు పురుషులు అందుబాటులో లేకుంటే స్వయం హస్తమైధునాలవంటివాటికి, టాయ్స్ సెక్స్ లకు కూడా అలవాటుపడి ఆనందిస్తున్నట్లు తెలిపారట.
ఐరిష్ మహిళలకు లైంగిక వాంఛలు అధికంగా వున్నాయని వీరిలో 42 శాతంమందికి కనీసం వారానికి మూడు సార్లు అయినా సంభోగం వుండాలని, వీరి తర్వాత లండన్ యువతులు, మరియు వెల్స్ వనితలు షుమారుగా 33, 29 శాతాలు వరుసగా వున్నారని సర్వే తెలిపింది. బ్రిటీష్ వనితలు తమ బెడ్ రూమ్ చర్యలకు పూర్తిగా తృప్తిపడేటందుకు పురుషులు అనుకూలంగా వుంటారని వుమన్స్ హెల్త్ సెక్స్ సర్వే వెల్లడించినట్లు డెయిలీ మెయిల్ పేర్కొంది.
అయితే, గత సంవత్సరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించిన సెక్స్ సర్వేలో జంటలకు గురువారం ఉదయం వేళ లైంగిక చర్యలకు అనుకూల సమయంగా వుండేదని పేర్కొంది. ఈ సమయంలో జంటలలోని సహజ కార్టిసోల్ ఎనర్జీ స్ధాయిలు అధికమై, సెక్స్ హార్మోన్లను తారాస్ధాయిలో వుంచుతాయని రీసెర్చర్లు తెలిపారు.
రోజు మొత్తంలో ఉదయం వేళ పురుషులలో సెక్స్ కారణ హార్మోన్లు టెస్టోస్టిరోన్, మహిళలలోని హార్మోన్లు ఈస్ట్రోజన్ షుమారుగా అయిదు రెట్లు అధికంగా వుంటాయని, ఈ సమయం సంభోగానికి సరైనదని రీసెర్చి వెల్లడించింది.