
నగరాలలో నివసించే జంటలకు ఇది సాధారణమే. తమ భాగస్వామి వేరే వారితో ఎఫైర్ సాగిస్తున్నాడని కూడా అనుమానపడతారు. శారీరక దూరం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. రతి తరచుగా లేకుంటే, శారీరక దూరం పెరుగుతుంది. భావావేశాలు కరువవుతాయి. ఈ పరిస్ధితి జంటల విడాకులవరకు కూడా దారి తీయవచ్చు. భాగస్వాములలో ఒకరు రతి వద్దంటే మరొకరు దానిని జీర్ణించుకోలేరు.
అటువంటపుడు ఏం చేయాలి?
బెడ్ లో భాగస్వామితో రొటీన్ గా చేసే రతి కాకుండా కొత్త భంగిమలు ఆచరించండి. కొత్త మెళకువలు తెలుసుకోండి. వాటిని ప్రదర్శించటానికి సంకోచించవద్దు. ఈ చర్య మీకు మీ భాగస్వామికి కొత్త శక్తినిస్తుంది. కొంతమంది మహిళలకు నేరు జననాంగ రతి కంటే కూడా ముద్దులు, కౌగిలింతలు, పొర్లటాలు ఆనందం ఇస్తాయి. మీ పార్టనర్ ఆ రకం వ్యక్తి అయితే, అవి చేసి ఆనందింపజేయాలి.
పురుషుడు ఆమెతో శారీరక ప్రేమ ప్రదర్శించి ఆమెకుగల ఇష్టాలను తెలుసుకోవాలి. పిచ్చిపట్టినట్టు నేరుగా రతికి దిగితే ఆమె మరోసారిఇష్టం ప్రదర్శించదు. సుఖ స్ధానాలను స్పర్శించాలి. ఆమె జుట్టు నిమరాలి. పెదవులు కొరకాలి. మెడ స్పర్శించాలి. వీటితో ఆమె ఎంతో ఆనందపడుతుంది. పగలంతా అలసి రాత్రి బెడ్ చేరారా? అటువంటపుడు ఇంటికి రాగానే ముందు పని భారం అంతా మరచిపొండి. బయట జరిగిన విషయాలు మరచిపోతేగాని, మరోమారు మూడ్ తెచ్చుకొని పార్టనర్తో పడక ఎక్కలేరనేది గ్రహించండి. కనీసం బయటి విషయాలు మరచిపోవటం కొరకైనా సరే మూడ్ తెచ్చుకొని పడకగది ఆనందం పొందటం న్యాయమని భావించండి.
పార్టనర్ కు అవసరమైన శారీరక మసాజ్ ఇవ్వండి ఒకరినొకరు స్పర్శించుకుంటూ మరోమారు పడక గది సుఖాలకు చేరాలి. ఇద్దరికి అనుకూలమైన అంశాలు విశ్రాంతినిచ్చేవిగా సంభాషించండి. లేదా కలసి స్నానం చేయండి. బాత్ టబ్ లో సువాసనల ద్రవ్యాలు కలిపి వాసనలు, సెంటెడ్ కేండిల్స్ వంటివి ఆనందించండి.
రతి జీవితంలో కూడా హాస్యం కావాలి. ఖరీదైన బహుమానాలు, సువాసనల కేండిల్స్ మాత్రమే కాదు. రతిలో హాస్యంజోడించాలి. కలసి నవ్వండి, చేయకూడని పనులు చేయండి. ఆనందించండి. కొద్దిపాటి ఉద్రేకం, ఇష్టం వంటివి మిమ్మల్ని ముందుకు కొనసాగేలా చేస్తాయి. చాలామంది తమ భాగస్వాములను మాటలలో మెప్పించలేరు. ఎంతో అసౌకర్యం భావిస్తారు. కాని ఎంత కష్టపడినప్పటికి వారు వీటిని సాధిస్తే ఇద్దరికి ఆనందమే. శారీరక స్పందనలకంటే కూడా మానసిక ఆనందం మరపురానిదిగా వుంటుంది. భాగస్వామి ఒక సెక్స్ బొమ్మ కాదని, మంచి సంబంధాలతో అతనిని లేదా ఆమెను ఆకర్షించాలని గ్రహించండి.



Click it and Unblock the Notifications




