•  

శృంగారానికి దూరంగా...పార్టనర్ కు చేరువగా...!

Is Romance Allowed In Menstruation?
 
నెలసరి సమయంలో మహిళలు తమ భర్తల నుంచి విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటారు. కొంతమంది భర్తలు మాత్రమే తమ భార్యల పరిస్థితిని అర్థం చేసుకుని నెలసరి సమయంలో రతి క్రియకు దూరంగా ఉంటారు. మరికొందరు భర్తలు అయితే, సెక్స్‌ చేయాల్సిందేనంటూ గట్టిగా పట్టుబట్టటం భార్యలను విసిగించటం చేస్తారు. ఈ రకమైన చర్యలు భార్యలకు తీవ్ర చికాకు కలిగించటంతోపాటు భర్తల పట్ల అసహ్యం, అసహనాన్ని రేకెత్తిస్తాయి.

రుతుక్రమ సమయంలో పలువురు మహిళలు అయితే, తమ భర్తలను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోవాలని కూడా భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కాదని మగవారు భావిస్తుంటారు. అయితే, ఈ రుతుక్రమ సమయంలోనే స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతారు. వారికిగల మానసిక స్ధితి రతిక్రీడలకు అనుకూలించదు.

ఈ రకమైన భావోద్వేగాలతో పాటుగా, శారీరకంగాను వీరు అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. తీవ్రమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావం కారణంగా నీరసంలాంటివి ఉంటాయి. ఈ సమయంలో ఇంటి పని - వంట పనిలో భర్త షేర్ చేసుకోవడమే కాదు మానసికంగా కూడా ఆమెకు కొంత ప్రశాంతతను చేకూర్చాల్సిన అవసరముంటుంది. రుతుక్రమం జరిగే సమయంలో భార్యకు పూర్తి విశ్రాంతి ఎంతో అవసరం అని భర్త గ్రహించాలి. శారీరకంగా, మానసికంగా ఆమెకు సహకరించాలి.

ఉద్యోగం చేసే మహిళలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనైతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు. పైపెచ్చు.. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే అధిక రక్తస్రావంతో పాటు కడుపునొప్పి ఎక్కువ అవుతుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అందుకే నెలసరి సమయంలో శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

శుభ్రత ప్రధానం. ప్రతి ఒక్కరు తాము శుభ్రంగా వున్న పార్టనర్ తో నే సెక్స్ చేయాలనుకుంటారు. కనుక మంచి శుభ్రత అనేది లైంగిక భాగస్వామ్యంలో అతి ప్రధానం. మీ సెక్స్ పార్టనర్ అత్యంత హాయిని గొల్పేదిగా వుండాలి. శరీరం ఏ మాత్రం అస్వస్ధతగా వున్నా పూర్తి ఆనందం కొరవడినట్లే. కనుక మీ పార్ట్నర్ మానసికంగాను, శారీరకంగానూ ఫిట్ గా వుందో లేదో చూసుకోండి. ఆమె నుండి చెడు వాసన ఏదైనప్పటికి సెక్స్ ఆనందం ఇక ముగిసినట్లే.

English summary

 Moreover, if intercourse is done duing menstrual cycle bleeding will be more and this results in stomach ache for the women. This being the reason, doctors advise not to indulge in sexual activities during menstrual periods. Working women get tired by doing house work and employment. Even House wives get tired by doing the regular house work in their menstrual period.
Story first published: Saturday, May 19, 2012, 14:04 [IST]

Get Notifications from Telugu Indiansutras