మెనోపాజ్ దశ చేరే ముందు మహిళలలో సంతానోత్పత్తి హార్మోన్లు వెనుకబడతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ స్ధాయి తగ్గుతుంది. లైంగిక వాంఛలు సన్నగిల్లుతాయి. తమకు తేలికగా లైంగిక భావాలు కలగటంలేదని చాలా మంది భావిస్తూంటారు. సెక్స్ లో ఆసక్తి సన్నగిల్లుతూంటుంది. అంతేకాక, తక్కువ స్ధాయిలో వున్న ఈస్ట్రోజన్ మహిళల యోనిని కుచింపచేస్తుంది. అంతవరకు విశాలంగా వున్న యోని భాగం సన్నగా అయిపోతుంది. యోని వద్ద అంతా పొడిగా వుంటుంది. ద్రవాలు ఊరటం తగ్గిపోతుంది. ఫలితంగా సెక్స్ చేసినపుడు ఆమెకు విపరీతమైన నొప్పి కలుగుతుంది.
అంతేకాదు, మహిళ ఈ సమయంలో భావావేశాలకు లోనవుతుంది. కోపంగా వుండటం మరల సాధారణ స్ధాయికి రావటం వంటి మూడ్ స్వింగ్ లు వుంటాయి. ఇవన్ని కూడా సెక్స్ పట్ల ఆసక్తిని తగ్గించేస్తాయి. పైగా, ఈ వయసులో ఆరోగ్య పరిస్ధితి కూడా అదుపు తప్పి వుంటుంది. ఈ వయసులో గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ళ నొప్పులు మరియు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల అరుగుదల వ్యాధి వస్తాయి. ఈ వ్యాధులు శారీరకంగా సెక్స్ లో కష్టపడేలా చేస్తాయి.
అయినప్పటికి అంతమాత్రం చేత వ్యక్తులు ఈ వయసులో తమ శృంగార జీవనం అంతమైందని భావించరాదు. వాస్తవానికి ఈ వయసులోనే సెక్స్ ఆనందం బాగా చవి చూడవచ్చు. ఈ వయసు మహిళలకు గర్భం వస్తుందన్న భయం లేదు లేదా నెలసరి పిరీయడ్ లు వస్తాయన్న బెంగ వుండదు, లేదా తాము భాధ్యత తీసుకోవాల్సిన చిన్న పిల్లలు వుండరు. ఈ కారణాలుగా వారు యధేచ్ఛగా రాసలీలలు సాగించవచ్చు.
అయితే, వచ్చిన ఆరోగ్య సమస్యలకు సాధ్యమైనంతవరకు వీరు తమ జీవన విధానం మార్చుకోవాలి. సంతులిత ఆహారం అంటే..పండ్లు, తాజా కూరలు, రోజువారీ వ్యాయామం, ధ్యానం, తగినంత రోజువారి నిద్ర మరియు ఆల్కహాల్, పొగ సేవనం వంటివి మానివేయటం వంటివి చేసి ఆరోగ్యంగా వుండాలి. ఇక రతి క్రీడలో నొప్పి లేకుండా తగిన లూబ్రికేషన్ చేయాలి లేదా ఆయింట్ మెంట్లు రాసి యోని పొడిని తగ్గించవచ్చు. మీరు కనుక ఈ సమయంలో మెనోపాజ్ లోని చెడు దశ ను అంటే రాత్రి చెమటలు, ఒల్ళంతా వేడి గా వుండటం, మనోవేదన మొదలైనవి కలిగి వుంటే తక్షణమే వైద్యులను సంప్రదించి హార్మోన్ రీప్లేస్ మెంట్ ధిరపీ తీసుకోండి. పరిస్ధితి చక్కబడుతుంది.