•  

బెడ్ రూమ్ కంటే... బాత్ రూమ్ బెటర్ డార్లింగ్...?

Bathe Together for Great Romance Life!
 
మీ లైంగికజీవితం మరింత ఆహ్లాదం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కొత్త పద్ధతులు పాటించండి. మీ ఆనందాలను బెడ్ రూమ్ నుండి బాత్ రూమ్ కు బదిలీ చేయండి. బాత్ రూమ్ షవర్ లో బాగా ఆనందించండి. అదెలా? పరిశీలించండి.

గతంలో సినిమాలలో శృంగార దృశ్యాలు చూపాలంటే....బాత్ రూమ్ లో స్నానం చేసే హీరో...వీపు రుద్దే హీరోయిన్, లేదా టవల్ అంటూ హీరో బాత్ రూమ్ నుండి కేక పెట్టటం, హీరోయిన్ టవల్ తెచ్చి అందిస్తే ఆమెను బాత్ రూమ్ లోకి లాగేసి.....ఆ పని చేసేయటం వంటి సీన్లు సాధారణంగా వుండేవి. కాని ఇపుడు జంటలు బాగా అడ్వాన్స్ అయిపోయారు. బాత్ రూమ్ లు కూడా బెడ్ రూమ్ లకంటే సుఖవంతంగా అన్ని సౌకర్యాలతో అమర్చబడి వుంటున్నాయి. మరి తాజాగా ఆధునికంగా జంటలు సెట్టింగ్ వేయాలంటే ఎంతో టాప్ గా కనపడుతున్నాయి. గతంలో వలే కాకుండా సిగ్గు వదిలి కలసి బాత్ రూమ్ టబ్ లో నేరుగా దూరి మజాలు చేసేస్తున్నారు. ఈ రకంగా కలసి స్నానాలు చేస్తే అది మంచి రతికి దోవతీయటమే కాక ఒకరంటే ఒకరికి మరింత అనుబంధం ఏర్పడుతుంది.

వాస్తవానికి ఏ రోజు బాత్ రూమ్ లో కలసి షవర్ తీసుకోవాలనేది మేము ముందుగానే నిర్ణయించుకుంటాం. ముందు అనుకోటంలో ఆనందమే వేరు. ఇక ఆరోజుకు బాత్ రూమ్ ఆనందం బ్రహ్మానందమే. ఒకరి దుస్తులు మరి ఒకరు తీసేసుకోవడం వంటివి ఎంతో అల్లరిగా వుంటాయి. ఎపుడూ బోర్ కొట్టే బెడ్ రూమ్ కంటే...సెషన్ ఎంతో బాగుంటుంది. దానిని అనుభవించి తీరాల్సిందే అంటున్నారు నేటి జంటలు.

మొదటిసారి అటువంటి బాత్ రూమ్ రతి గోలకు బాగా ఆలోచించాలి. యువతి ఒప్పుకుంటే, యువకుడు ఒప్పుకోడు. యువకుడు ఒప్పుకుంటే, యువతి ఒప్పుకోదు. అయితే, కొన్ని హద్దులతో ఇద్దరూ అంగీకరించేస్తే బాగానే వుంటుంది. మొదటిలో సిగ్గు దంచేస్తుంది. పోను పోను అలవాటై అదే కావాలనిపిస్తుంది. అనుబంధం గట్టిపడుతుంది.

మరిక పాత బాత్ రూమ్ లకు కొత్త ఫిటింగ్ ల కళ కావాలి. అందుకవసరమైన వివిధ పరికరాలు అమర్చుకోవాలి. మొబైల్ షవర్లు, స్టీమ్ బాత్ స్పాంజ్ బాత్ లు ఎన్నో కొత్త అంశాలు. కొత్త ఆరాటం...పాత పోరాటం. పోను పోను మరిన్ని రకాల ఆధునిక రతి క్రీడలు కనిపెట్టి ఆనందించేసేలా వున్నారు ఈ నేటితరం జంటలు.

English summary
Gone are the days when men were shown in movies asking for the towel or bar soaps and then trying to pull their ladies inside the bathroom, all efforts in vain though. Couples seems to have come out of the closet now and entered the bathroom, for a good shower.
Story first published: Wednesday, May 23, 2012, 11:30 [IST]

Get Notifications from Telugu Indiansutras