1. వివాహమైన కొత్తలలో వుండే ఆసక్తి, ఆరాటం తర్వాతి రోజులలో మెల్లగా మాయమవుతుంది. పోయిన ఆ ప్రేమాననుభూతులకు గానుమరోమారు మీరు ఆ రోజులలో ఆ క్షణాలలో ఒకరంటే ఒకరు ఎలా తపించిపోయారో గుర్తులు తెచ్చుకోండి. ఆ సంబంధం మరోమారు, అంత మధురంగా కాకపోయినా, కొంతలో కొంత పునరుజ్జీవం పొందుతుంది. అనుభూతులు మాయమైతే, వాటి స్ధానంలో చెలిమి ఏర్పడుతూందనేది గుర్తుంచుకోండి. కనుక మంచి స్నేహితులుగా కూడా కొనసాగవచ్చు.
2. నిజమే, మీరిపుడు భార్యా భర్తలు అయినప్పటికి మీ గుర్తింపులు రెండూ కోల్పోయి ఒకరుగా వుండాల్సిన పనిలేదు. వివాహం ముందర మీరు స్కర్టుల దనుస్తులు, కుర్రాళ్ళతో క్రికెట్ వంటివి ఆడుతూంటే, పెళ్ళైన తర్వాత వాటిని నిలపాల్సిన పనిలేదు. అది ఎవరిని బాధించనంతకాలం, మీ గుర్తింపును మీరు ఉంచుకోండి. అపుడు మీ వ్యక్తిత్వం పోదు. ఈ చర్య మీ సంబంధం పాతబడినప్పటికి మీకు విసుగు, అలసట కలిగించకుండా వుంటుంది.
3. కలసి అధిక సమయం గడపండి. అదే సమయంలో వ్యక్తిగతంగా ఎవరి సమయం వారు జాగ్రత్త పడండి. అధికంగా కలసి వుంటే వచ్చే సమస్యలు ఈ రీతిగా సమయం గడిపితే, పరిష్కారమవుతాయి.
4. ఒకరినొకరు గౌరవించుకోవటం ప్రధానం. సంభాషణ మీ మధ్య ఆగిపోకుండా చూడండి. ఏ మాత్రం మాటలు ఆగినా అది ప్రమాదమే. ఒకరి ఆలోచనలు ఒకరు, ఒకరి ప్రణాళికలు మరి ఒకరు పంచుకోండి. సమస్యలనుకున్నవి గుర్తించి పరిష్కారం కోరండి.
5. జంటల మధ్య తగవులు సాధారణం. మరల కలుసుకోవటం కూడా వుంటుంది. రోజులో అరుచుకున్నా, పోట్లాడుకున్నా, ఏం చేసినప్పటికి అదే రోజు సూర్యాస్తమయానికి వాటికి స్వస్తి చెప్పండి.
6. జంటలు ఆర్ధిక అంశాలపై తగవులు పడతారు. మీ బ్యాంక్ ఎకౌంట్లు జాయింటుగానే వుంచాల్సిన పనిలేదు. ఎవరి ఆర్ధిక స్వాతంత్రం వారు వుంచుకోవచ్చు.
7. నమ్మకం - మీ భాగస్వామి ఎవరినైనా ప్రశంసించారా? లేక దొంగచూపులు చూశారా? అతను మిమ్మల్ని వంచిస్తున్నాడని భావించకండి. నేటిరోజులలో జరుగుతున్న తీరు తెన్నులకు అటువంటివన్ని పై పైనే జరుగుతాయి కాని మీ సంబంధాలను తెంపే భారీ అంశాలుగా పరిగణించకండి.
8. పిల్లల పెంపకం - జంటలు పిల్లల పెంపకంపై కూడా తగవులు పడతారు. మీలో ఒకరు కనుక మంచి క్రమశిక్షణ కలిగి మరొకరికి లేకుంటే ఈ సమస్య అధికంగా వుంటుంది. కనుక ఈ అంశంలో ఇద్దరికి నచ్చే విధంగా బ్యాలన్స్ కలిగి పిల్లల పెంపకం ఆదర్శంగా సాగాలని గ్రహించండి.
9. విశ్రాంతి సెలవులు కలిసి ఆనందించండి. అపుడపుడూ రొటీన్ నుండి భిన్నంగా వేరే ప్రదేశాలకు వెళ్ళి కలసి ఆనందించండి.
10. ఒకరి బలహీనతలను మరి ఒకరు గౌరవించండి. అతను తన తల్లిగురించిన వ్యాఖ్యలు భరించలేకపోతే, వాటిని పెద్ద అంశాలుగా చిత్రీకరించకండి. ఒకరికొకరు హాస్యంగా మాట్లాడుకోవటం ఆరోగ్యకరం అనేది గ్రహించండి.
11. వివాహం అనేది బోర్, రొటీన్, విసుగు....కాని రాత్రి అయ్యే సరికి బెడ్ రూమ్ మంచి మజా అందిస్తుంది. మీ స్కోరింగ్ తగ్గకుండా చూసుకోండి. కలసి పడుకోవటం బెడ్ రూమ్ ఏర్పాటే కాదు అది ఒక వివాహ బంధం అని కూడా గుర్తించండి.