వివాహం అయితే, కొత్త బంధాలు ఏర్పడతాయని, తాము పురుషులకు లొంగి వుండవలసి వస్తుందని మహిళలు, మహిళలు, తమకు స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇవ్వరని వివాహం తర్వాత కుటుంబ భాధ్యతలకు లొంగి వుండవలసి వస్తుందని, పిల్లల భాధ్యత, ఇంటి భాధ్యతలు ఆర్ధికపరంగా వారిని కుంగదీస్తాయని పురుషులు వెల్లడిస్తున్నారు. వీరు నిర్వహించినస్టడీలో షుమారు 67 శాతం మంది జంటలు విడాకుల భయాన్ని ప్రకటించారు. ఉద్యోగాలు చేస్తూ, పదవులలో వున్న జంటలకంటే కూడా మధ్య తరగతి వ్యక్తులు పెళ్ళి పట్ల చాలా పాజిటివ్ గా స్పందించారట.
ఎక్కువ ఆదాయాలు కల మహిళలు, ప్రత్యేకించి పురుషులకంటే అధిక ఆదాయం కలమహిళలు పురుషులను పెళ్ళాడటం తమకు ఒక వల వంటిదని, ఒక సారి అందులో పడితే మరల బయటకు రావటం కష్టమని లేదంటే వారికి అదనపు కుటుంబ భాధ్యతలు నెత్తినపడతాయని, పెళ్ళి నుండి వచ్చే ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువని వెల్లడించారు. పెళ్ళి అనేది ఒక వెడ్డింగ్ కార్డ్ వరకు మాత్రమే అని దాని తర్వాత వారు విచ్చలవిడిగా వ్యవహరించటం జరుగుతోందని అంగీకరించారు. ఒకసారి తమ భాగస్వామి తమ ఆదాయంపై ఆధారపడితే, ఇక జీవితాంతం తమ ఆదాయం అతనికి పంచవలసి వస్తుందని వారు భావించారు.
చిన్న వయసు జంటల పరిస్ధితి ఇలా వుంటే, బ్రిటన్ లో మహిళలు తమ వయసు నలభై దాటిందంటే చాలు...సరికొత్త హొయలు పోతున్నారట. దానికి కారణం అప్పటికి చాలా కాలంగా రతికార్యం ఆపేయటమేనట. ఇక స్కాట్లాండ్ మహిళలైతే 35 సంవత్సరాలొస్తేచాలు పడకకంటే, చేతిలో పుస్తకానికే ప్రాధాన్యత. ఆ వయసులో ఇంకా సెక్స్ చేస్తుంటే...పిల్లలు అడ్డంకని గునుస్తున్నారు. అయితే పిల్లలు లేని మహిళలు మాత్రం రెగ్యులర్ గా అద్భుత ఆనందాల్ని ఆస్వాదిస్తూ ఎన్ జాయ్ అనేస్తున్నారని ఒక తాజా సర్వే చెపుతోంది.
అసలు విషయం మహిళలందరూ చాలా వరకు మంచి ఉద్యోగాలలో వుండి అధికారాన్ని అనుభవించటమేనని, పెళ్ళిళ్ళు, సెక్సూ చేస్తూ కూర్చుంటే వారు అదంతా మిస్సయి అతి సాధారణంగా జీవించాల్సివస్తుందని, అంతేకాక వారి పిల్లల కెరీర్ల కొరకు కూడా వారి తాపత్రయం అధికమై, తమ స్వంత సెక్స్ జీవితాల్ని పణంగా పెట్టేసి దేశంలో సెక్స్ కోరికలు మాయమయ్యేలా చేసేస్తున్నారని సర్వే ఏజన్సీ వెల్లడించింది. టైమ్ అంటూ వుంటే....నెలకోసారి మాత్రమే....ఆహ్....అభ్భా అంటున్నారట ఈ మహిళలు. ఈ అంశాలను ఆదేశంలోని సైకాలజిస్టు ప్రొఫెసర్ పౌల్ నికల్సన్ బాగా స్టడీ చేసి వెల్లడించినట్లు డెయిలీ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది.