మహిళల కామవాంఛ అధికంచేసేందుకు సహజ మార్గాలు -
మొదటగా ఆమెలో కామవాంఛ తగ్గిపోవటమనేది ఏ కారణంగా జరిగిందనేదానికి మూల కారణం గుర్తించండి. ఒక సారి మూల కారణం గుర్తిస్తే దానికి పరిష్కార మార్గం వెతకటం తేలికవుతుంది. భాగస్వామితో సన్నిహితం లేకపోవటం, కలసి సమయం గడపకపోవటం వంటివి మీ మధ్య వున్నట్లయితే, దానికిగాను మీరు ఆమెతో అధిక సమయం గడపండి. ఒకరినొకరు సన్నిహితంగా అనుసరిస్తూ అనుబంధం పెంచుకోండి. ఇది మీరు సంభాషించటంవలన, కలసి సినిమాలు చూడటం, ఎక్కువ రాత్రులు రతి చేయడం, ఒకరినొకరు అభినందించుకుంటూ బంధంతో గడపగలగటం వంటివి చేయాలి.
మహిళలలో వాంఛ తగ్గడం హార్మోన్ల ప్రభావంగా కూడా వుంటుంది. ధైరాయిడ్ లోపం, డిప్రెషన్, ఇతర వైద్య సమస్యలు వుంటాయి. అటువంటి సమయంలో, మీకు ఒక వైద్యుని సహాయం అవసరం అవుతుంది. అతడు ఆమె సమస్యను గుర్తిస్తాడు. దానికి సహజ పరిష్కారాలు కనుగొంటాడు. రతి సమస్యలు నివారించటంలో ఆహారం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. రతి ఆరోగ్యానికి అనేక విటమిన్లు, మినరల్స్ కావాలి. విటమిన్లు సి,బి,ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, ఐరన్ మొదలైనవి వున్న ఆహారం ప్రధానంగా అవసరం. హార్మోన్ల లోపంగా కనుక రతి వాంఛ లోపిస్తే దానికి సహజ ఆహారాలైన, అవిసెగింజలు, సోయా, గింజలు వంటివి ఆమెలోకల ఈస్ట్రోజన్ అసమతుల్యత తొలగించి సమస్యలను సరిచేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే గ్రీన్ టీ మహిళలలో కామ వాంఛలను కలిగిస్తుంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ ఈ అంశంలో సహకరించటమే కాక, రక్తంలోని కొల్లెస్టరాల్ తగ్గించి శరీర బరువు నియంత్రణలో వుండేలా చేస్తుంది. జింక్గో బిలోబా అనే చైనా వనమూలిక పురుషులలోను, మహిళలలోను కల లైంగిక లోపాలను సరిచేస్తుంది. అది టెస్టోస్టిరోన్ అనే సెక్స్ హార్మోన్ ను పెంచి లైంగిక జీవనాన్ని మెరుగుపరుస్తుంది.
ప్రతిరోజూ మెంతులు ఇతర ఆహారాలతో కలిపి తింటే శరీరంలోని సహజ ఈస్ట్రోజన్ పెరిగి కామవాంఛలు పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళన, శక్తి హీనత వంటి వాటికి ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే ప్రయోజనకరంగా వుంటుంది. వ్యాయామం మహిళలకు ఒత్తిడినుండి రక్షణ ఇచ్చి లైంగిక చర్యలకవసరమైన శక్తినిస్తుంది. యోగా, ధ్యానం వంటివి శరీరానికే కాదు, మనసుకు కూడా ప్రయోజనకరంగా వుంటాయి.