జననాంగాలలో తేమ బాగావుంటే అంగం చొచ్చుకుపోవటం తేలికగా వుంటుంది. ప్రతి మహిళ కామవాంఛ కలిగితే చాలు యోనిలో ద్రవాలు ఊరుతూంటాయి. పొడిబారిన యోని రతిక్రీడకు అసౌకర్యంగా వుంటుంది. పైగా చాలా బాధాకరంగాను ఇన్ఫెక్షన్ కలిగించేదిగాను ఉంటుంది. కనుక రతిలో జననాంగ భాగాలలో సహజ ద్రవాలు ఊరటం అవసరం.
ఆమెలో వాంఛ కలిగించినప్పటికి కొన్నిసార్లు యోని సరళత కలిగివుండదు. పొడిబారిన యోని రతికి సౌకర్యంకాదు. ఏ మాత్రం ఆనందం కనిపించదు. కనుక, కొన్ని సహజ పద్ధతులలో ఆమెకు జననాంగ తేమ కలిగించడం ఎలా అనేది పరిశీలిద్దాం.
నీరు తాగండి - పొడిబారిన యోనికి కారణం శరీరంలో సరైన మొత్తంలో నీరు లేకపోవటం. కనుక ఈ పొడిని నివారించటానికి, నీరు అధికంగా తాగండి. డీహైడ్రేషన్ యోనిని మంటపెడుతుంది, ఇక అందులోకి అంగం ప్రవేశించటం మరింత కష్టంగా వుంటుంది. కనుక ప్రతిరోజూ క్రమం తప్పకుండా 8 నుండి 10 గ్లాసుల నీరు మహిళ తాగాలి.
ఫోర్ ప్లే అధికం చేయండి - మహిళలను ఉద్రేకపరచాలి. అందుకు తగిన సమయం కేటాయించి ఫోర్ ప్లే చేయండి. సహజంగా ద్రవాలు ఊరి సౌకర్యంగా వుంటుంది. ఆమెలో కోరిక కలగాలంటే మీరు బాగా శ్రమించాల్సిందే. మహిళలకు ఫోర్ ప్లే చాలా ఇష్టం. కనుక లూబ్రికేషన్ కు అదొక మార్గంగా కూడా అనుసరించండి.
అండం వదిలే సమయంలో - మహిళ అండం వదిలే సమయంలో ద్రవాలు బాగానే వెలువడతాయి. అయితే మనిషి మనిషి కి ఇది మారుతుంది. అండం విడుదల సమయంలో యోని నుండి బయటకు వచ్చే తెల్లటి ద్రవం రతిక్రీడకు సహకరించి ఆనందం అందిస్తుంది. అయితే, అండోత్సర్గ సమయం గర్భం తెచ్చేందుకు అధిక అవకాశం కల్పిస్తుంది కనుక జాగ్రత్త పడండి. గర్భం రాకూడదనుకుంటే, తగిన జాగ్రత్తలు తీసుకోండి.
లూబ్రికేషన్లు - సాధారణంగా మహిళలు అంగం జారుడుకు డ్రగ్ స్టోర్స్ లో వుండే లూబ్రికేషన్లు వాడతారు. అయితే వీటిలో ఏ మాత్రం షుగర్ లేకుండా చూడండి. షుగర్ వుంటే అది ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దోవతీస్తుంది.
కామోద్దీపన ఆహారాలు - ద్రవాలు ఊరాలంటే ఈస్ట్రోజన్ కావాలి. మెనోపాజ్ తర్వాత మహిళలు ఎంత ఉద్రేకం కలిగినా, తేమను పొందలేరు. అటువంటపుడు శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయి పెంచేందుకు తగిన ఆహారాలు తినాలి. అవి సోయా ఉత్పత్తులు, సల్మాన్ చేప, వైన్, స్ట్రాబెర్రీలు, ఆకు కూరలు, చాక్లెట్లు మొదలైనవి ఈస్ట్రోజన్ సహజంగా పెంచి లూబ్రికేషన్ కలిగిస్తాయి.
ఈ సహజ మార్గాలు ద్వారా ఆమె జననాంగాలలో తేమనుపెంచి నొప్పిలేని రతిని ఆచరించండి. యోని లేదా లోపలి భాగం బాగా మంటపెడితే, శుభ్రంగా ఆ భాగాలను వెంటనే కడగండి. మంట ఇంకా తగ్గకపోతే అపుడు డాక్టర్ ను సంప్రదించండి.