ఈ ఆహారాలు సహజంగా పనిచేసి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని మెరుగైన లైంగిక జీవితాన్నిస్తాయి. క్రమేణా మీరు మీ జీవిత భాగస్వామితో పూర్తి ఆనందాన్ని అనుభవించవచ్చు. ఈ ఆహారాలు మీ సుఖ స్ధానాలను, ఇంద్రియాలను ప్రభావితం చేస్తాయి. పురుషులకు, మహిళలకు గ్రంధులు హార్మోన్లను ఉత్పత్తి చేసేలా చేస్తాయి. లైంగిక పటుత్వం మెరుగుపరుస్తాయి. ఆ రకంగా సహజ లైంగికతలను పెంచే ఆహారాలు మీ దాంపత్య జీవితానికి ఆనందం కలిగిస్తాయి. అవేమిటో పరిశీలించండి.
పుచ్చకాయ - పుచ్చపండు చల్లటిదే కావచ్చు రోజులో తరచుగా తీసుకుంటే, మీ లైంగిక జీవితం మెరుగవుతుంది. సహజమైన వయాగ్రా గా పేర్కొనవచ్చు. పుచ్చకాయలో సిట్రులిన్ అనే ఎమినో యాసిడ్లు వుంటాయి. ఇది రక్తనాళాలను వ్యాకోచింపచేసి లైంగిక ఆనందం పెంచుతుంది. అంగ స్తంభన సమస్యలకు పుచ్చకాయ బాగా పనిచేస్తుంది.
చాక్లెట్ - చాక్లెట్ లు తియ్యగా వుండి కామ వాంఛను కలిగిస్తాయి. ప్రేమకు అనురాగానికి ఇవి చిహ్నాలుగా వుంటాయి. మహిళ తనలో ఎండార్ఫిన్లు రిలీజ్ చేయాలంటే చాక్లెట్ బాగా పనిచేస్తుంది. చాక్లెట్ తిన్న తర్వాత నాలుగు రెట్లు ఆనందంగా మహిళలు వుంటారని స్టడీలు చెపుతున్నాయి.
వెల్లుల్లి - వెల్లుల్లిని గతంలో ధారాళంగా ఉపయోగించి లైంగిక జీవితాలను మెరుగుపరచేవారు. వెల్లుల్లి తింటే పురుషులైనా, స్త్రీలైనా ఉద్రేకాలకు లోనవుతారు. వెల్లుల్లిలో వుండే ఎల్లిసిన్ అనే రసాయనం జననాంగాలకు రక్తప్రసరణ అధికం చేస్తుంది.
ఆరెంజస్ - దీనిలో ఉద్రేకం కలిగించే గుణాలు లేకపోయినా, దానికిగల తీపి, పులుపు కలిసి అది ప్రేమికులకు ఆహ్లాదం కలిగించే పండుగా పరిగణించబడుతోంది. ఈ నారింజపండును చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా కూడా తినవచ్చు. ప్రేమికులమధ్య నారింజ పండు మంచి అనుబంధం పెంచుతుంది.