•  

లైనేస్తే....లవ్వాడాల్సిందే...!

Pretend to be Strangers for Great Romance!
 
ఒకరి శరీరాంగాల గురించి మరొకరు పూర్తిగా పరిశోధించేశారు. ఇక మిగిలేది బోరింగ్ సెక్స్. కొన్ని మార్లు ఆసక్తి ....నిల్, మొద్దు నిద్రే. మరి అటువంటి జీవితాలకు చిన్నపాటి బెడ్ రూమ్ ఝలక్ ఇవ్వాలంటే....

జంటలకు కొత్తల్లో ఒకరి శరీరం మరి ఒకరికి ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. ఏదో చేసేయాలనే తాపత్రయంతో బాగా ఆనందిస్తారు. బెడ్ రూమ్ సమయం అధికంగా వుండి ఆనందం బాగా వుంటుంది. కాని, రోజులు గడిచే కొద్ది....అవే శరీరాలు, అవే భంగిమలు, అవే సంభాషణలు, అవే చేష్టలు వారిలో ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. బోర్ కొట్టేస్తుంది. మరి ఈ బోర్ కొట్టే రతి జీవితాలను ఆసక్తికరంగా మలచుకోవాలంటే ఏం చేయాలో చూడండి.

అపుడే కలిసినట్లు నటించండి....ఒకరినొకరు అపుడే కలిశారు. గతంలో మీరిద్దరికి పరిచయమేలేదు. కొత్త వ్యక్తులుగా భావించండి. మీ పార్టనర్ ని కొత్త రకంగా చూడండి. అపుడు మీ పార్టనర్ ఆకర్షణీయంగానే కనపడుతుంది. అలా కొత్తగా కనపడుతూంటే, మీలో ఎక్కడో ఇంకా ఆమె లేదా అతడిపై కోర్కె రాజుకుంటూనే వుందన్నమాట. అందుకుగాను చిన్న డ్రామా కూడా మీరు ఆడాలి. అపుడే మరింత ఉత్సాహంగా వుంటుంది.

ఆమెను లేదా అతడిని టీజ్ చేయండి...పురుషుడైనా, స్త్రీ అయినా టీజింగ్ కు బాధపడనివారుండరు. అంటే మీ టీజింగ్ ముద్దు ముచ్చట్లతో కూడినదై వుండాలి కాని భాగస్వామి భయపడేట్లుండరాదు. చిన్నపాటి ముద్దులు, సరసాలు, ఆఫీస్ కు వెళ్లే సమయంలో కిస్సులు, అవసరమనుకుంటే పార్కులో కలవడాలు వంటివి వుండాలి. దీనివలన ప్రయోజనం మీ మైండ్ లో ఏముందనేది అవతలివారికి తెలుస్తుంది. మీరు ఒంటరిగా వుంటే ఇక అవతలి వ్యక్తినుండి కూడా మంచి స్పందన వస్తుంది.

మూడ్ ...చాలామందికి మూడ్ వచ్చేస్తుంది. కాని దానిని వారు వెల్లడించకుండా వేరే పనిలో పడతారు. కారణం అర్ధం లేని భయాలుగా వుంటాయి. వాస్తవంలో వారు ఆచర్యలను ఇష్టపడతారు.

మీ భాగస్వామిని ఆశ్చర్య పరచే రీతిలో ఒక రోజు లేదా ఒక గంట ఆమె పని మీరు చేసేయండి. ఇది మరల జరగాలని కూడా వారు ఆశిస్తారు.

కొత్త టెక్నాలజీ వాడండి. నేడు వేగమైన ఇంటర్నెట్ వుంది. జీవితాలు మారిపోయాయి. మరి మీ సెక్స్ జీవితంకూడా దానితో మార్చేయండి. ఉద్రేకపరచే మెసేజీలు, ఇ మెయిళ్ళు పంపుకోండి. అయితే సెక్సీ లేదా వల్గర్ (బూతు) వంటివాటి మధ్య చిన్నపాటి తేడా వుంది. మీరు చేసేది సెక్సీగా వుండాలిగాని, బూతుగా వుండరాదు.

ఆ మెసేజ్ రోజంతా ఆమె మనసులో కదులుతూనే వుంటుంది. ఇక మిమ్మల్ని చూస్తే వారు వదలలేరు.

వాస్తవ జీవితం మరచిపొండి. ఆఫీసు పని, ఇంటిపని వంటివి మరచిపొండి. వారాంతపు సెలవులు వేరే ప్రదేశాలలో ఆనందించండి.

వారాంతపు సెలవలు అయిపోయాయా? ఇక మీ పాత భాధ్యతలు చేపట్టండి. వారాంతం వేరుగా ఆనందించారు కనుక అపుడు భాధ్యతలు మరింత ఆసక్తిగా నెరవేరుస్తారు.

ఆశ్చర్యాలు సృష్టించండి. ఎపుడూ మీ భాగస్వామి వద్ద అల్లరిగా ప్రవర్తించలేదా? ఇపుడు మొదలుపెట్టండి. ఒక డ్యాన్స్ చేయండి. తెలియకుంటే కనీసం పిరుదులు ఆడించండి. సంతోషపెట్టే లోదుస్తులు కొనండి.

లొంగిపొండి - మరచిపోలేని రతి అనుభవానికిగాను, అర్ధంలేని భయాలను మరచిపోవాలి. మీ పార్టనర్ కు మీరు లొంగిపొండి. ఏం చేసుకున్నా సరే అనేయండి. అయితే అది ఏ ఒక్కరిని బాధించరాదు.

పై చర్యలు పాటిస్తే, బెడ్ రూమ్ ఆనందమేకాదు అన్ని భయాలు తొలగితే మీ సంబంధం మరింత మెరుగవుతుంది.

English summary
If you have never done anything naughty with your partner, start now. Surprise him or her with a special dance (if you do know how to shake those hips), or in the case of women go buy some seriously suggestive lingerie. Your partner will not be able to resist. It will not only help you in the bedroom but once all inhibitions are gone and dealt with, even your relationship will improve.
Story first published: Friday, April 20, 2012, 13:48 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more