1. తడి టవల్స్, మురికిపట్టిన బూట్లు
మహిలలందరూ తడిసిన టవల్స్ బెడ్ మీద వుండటాన్ని, మురికిపట్టిన షూస్ తో ఇంట్లోకి రావటాన్ని అసహ్యించుకుంటారు. కనుక ఈ రెండు పనులూ ఆమెను చేయమని అడగకండి. మీ అంతట మీరే టవల్ ను బాత్ రూమ్ రాడ్ పైనా, మురికిపట్టిన మీ షూస్ ఇంటి వరండాలో వదిలేస్తూ వుంటే ఆమె ముఖంలో ఆనందం చూడగలరు.
2. గుర్తుపెట్టుకోండి
మీరు బయటకు వెళ్ళేటపుడు ఆమె పుచ్చకాయ పట్టుకురండి అన్నది కాని మీరు తెచ్చింది నిమ్మకాయలు. తరచుగా ఇది జరిగితే, ఆమె మీ పాలిట అగ్ని పర్వతమే. ఈ పరిస్ధితినుండి తప్పించుకోవాలంటే, మీరు ఆమె ఏం చెప్పిందనేది గుర్తుపెట్టుకోండి. ఆమె చెప్పిన వస్తువు చిన్నదైనా సరే ఖచ్చితంగా తీసుకు రండి. తప్పక అభినందిస్తుంది. అవసరమనుకుంటే కాగితంపై వ్రాసుకెళ్ళండి. మరి అక్కడికెళ్ళి నిమ్మకాయలనే పుచ్చకాయలుగా మాత్రం అనుకోకండి.
3. వినండి
వినటమే మీ వంతు. మాట్లాడటం ఆమె వంతే. మీరు ఇంటికి వస్తే ఇంటిపక్కవారు ఏం చేశారు? మెయిడ్ సర్వెంట్ ఏం చెప్పింది వంటివన్ని చెపుతుంది. ఆమె మైండ్ లో వున్నవన్ని బయటకు రావాలి అందుకని, మరో రకంగా, భర్తతో పంచుకోవడం. ఇదంతా మీకు బోర్ అనిపస్తోందా? వినటం మాత్రం మీకు హాని కలిగించదుకదా? ఇదంతా షుమారు 15 నిమిషాలలో అయిపోతుంది. ఒక్క 15 నిమిషాలు వింటే జీవితకాలం సంతోషం మీకు ఆమెకు గ్యారంటీ. ఖచ్చితంగా నమ్మండి.
4. సంభాషణలు
ఆమెను పొగడండి. అందంగా వున్నావనండి. ప్రశంసించండి. చెవిలో స్వీట్ నధింగ్స్ గుసగుసలాడేయండి. మధురమైన మీ మాటలు రోజంతా వినటానికి ఇష్టపడుతుంది. ఆఫీస్ సమయంలో చిన్నమాటి ‘మిస్ యూ’ టెక్స్ట్, ఇల్లువదిలేటపుడు బై బై బేబీ అంటూవుంటే ... అంతకు మించిన సంతోష పడే భార్య మరొకరుండరు.
ఒక మహిళను సంతోష పెట్టటం కష్టమేమీకాదు. తెలివిగా వ్యవహరించండి సరళంగా ఆచరించండి. సంతోషం దానంతట అదే వచ్చేస్తుంది.