•  

త్వరగా గర్భం ధరించాలంటే భంగిమలు!

Best Romance Positions to Get Pregnant!
 
గర్భం త్వరగా ధరించాలంటే సరైన రోజులలో రతిక్రీడ చేయటమే కాదు సరైన భంగిమలు కూడా ఆచరించాలి. పిల్లలు పుట్టాలని కోరుకునే వారికి కొన్ని రతి భంగిమలు అద్భుత ఫలితాలనిస్తాయి. యోనిలోపల లోతుగా వీర్యకణాలను వదిలే భంగిమలు రతిలో ఉపయోగిస్తే గర్భం ధరించే అవకాశాలు మెండుగా వుంటాయని నిపుణులు భావిస్తారు.

సాధారణంగా రతి భంగిమలలో అనాదిగా వస్తున్న మిషనరీ భంగిమను వీరు పిల్లలు త్వరగా పుట్టటానికి సిఫార్సు చేస్తారు. దీనికి కారణం మిషనరీ సెక్స్ భంగిమలో అంగం యోనిలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. కనుక వీర్యకణాలు గర్భం ముఖ ద్వారం వద్ద విడుదల అవుతాయి. అంతేకాక, మిషనరీ భంగిమలో మహిళ కింద పడుకోవటం ఆమెపై పురుషుడు కూర్చొని లేదా పడుకొని వుండటం చేత అతని వీర్యకణాలు బయటకు లీక్ అయ్యే సమస్య కూడా వుండదు. అతను విడుదల చేసిన వీర్యకణాలు ఎక్కువ దూరం కూడా ప్రయాణించనవసరం లేదు. వీర్యం సరిగ్గా యోని దాటి గర్భం ప్రవేశంలో పడిపోవటంతో అండంతో కలిసి సంయోగం చెందే అవకాశాలు మెండుగా వుంటాయి.

మిషనరీ పొజిషన్ తర్వాత వేగవంతంగా మహిళ గర్భం ధరించటానికి డాగీ స్టైల్ ఆచరించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన చేతులు నేలకానించి కాళ్ళపై నిలబడుతుంది. లేదా బోర్లా పడుకుంటుంది. పురుషుడు వెనుకనుండి ఆమె యోనిలోకి అంగప్రవేశం చేసి సరిగ్గా వీర్యాన్ని ఆమె గర్భం ప్రవేశంలో పడేట్లు చేస్తాడు. దీనినే డాగా స్టైల్ అంటారు. అంటే కుక్కల సంపర్కం వంటిది. ఇది కొద్దిపాటి అసౌకర్యం వున్నప్పటికి ఫలితం అధికంగా వుంటుంది. వీర్య స్కలనం తర్వాత, పురుషుడు ఆమెపై పరుండే కొంత రిలాక్స్డ్ గా సమయాన్ని గడపవచ్చు.

సాధారణంగా వీర్యకణాలు విడుదల సమయంలో బయటకు పోయే భంగిమలు చెప్పాలంటే, స్త్రీ, పురుషులు నిలబడి చేసినా లేదక కూర్చుని లేదా మహిళ పైనుండి పురుషుడు కింద పడుకుని చేసినా వీర్యం గర్భం లోకి ప్రవేశించక, గర్భం విఫలమయ్యే అవకాశాలు అధికంగా వుంటాయి.
వాస్తవానికి వైద్యులు, రతి సమయంలో మహిళ పిరుదుల కింద చిన్నపాటి తలగడను వుంచి, రతి ఆచరిస్తే, అంగంనుండి విడుదల అయ్యే వీర్యం బయటకు పోకుండా లేదా తక్కువ దూరంగా ప్రయాణించి గర్భం ప్రవేశంలో పడే అవకాశముంటుందని సూచిస్తారు.

English summary
In fact, doctors recommend placing a pillow under your hips to help tilt the pelvis as it will keep the sperm in longer. The positions that negate the chances of pregnancy are when you have sex standing, sitting or with women on top. These positions do not allow the sperm to stay inside the vagina for long.
Story first published: Monday, April 2, 2012, 16:45 [IST]

Get Notifications from Telugu Indiansutras