మీకు నిద్ర పట్టించటమే కాదు, మీలోని ఒత్తిడి దూరం చేస్తుంది. కేలరీలు ఖర్చు చేస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేసే రతిక్రీడ మీకు అందిస్తుంది.
పురుషుల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కూడా తాజా పరిశోధనలు చెపుతున్నాయి. కనీసం అంటే వారానికి రెండు సార్లు అయినా చేయాలట.
మీలోని రోగ నిరోధక వ్యవస్ధను బలపరుస్తుంది. శరీరాన్ని గట్టి పడేసి సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటివి రాకుండా చేస్తుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు వంటివి పూర్తిగా మాయం అవుతాయి. అంతేకాదు రెగ్యులర్ రతిలో రోజంతా ఉత్సాహమేనట.
తలనొప్పి అని ఫిర్యాదా? ఆ పని చేస్తే, తలనొప్పి గాయబ్. స్కలనం అయితే చాలు ఆక్సీటోసిన్ హార్మోన్ అయిదు రెట్లు మీ శరీరంలో పెరిగి ఆనందం ఇస్తుంది. నొప్పులు, బాధలు తగ్గిస్తుంది.
స్కలనం అయితే చాలు డీహైడ్రోపియన్ డ్రోస్టిరోన్ అనే హార్మోన్ విడుదలై సుదీర్ఘ జీవితాన్నిస్తుంది. శరీర కణాలను రిపేర్ చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా వుంచుతుంది.
గుండె అధికంగా కొట్టుకొని రక్తప్రసరణ అధికం చేస్తుంది. అవయవాలకు, కణాలకు తాజా రక్తం ఎక్కుతుంది. అలసిన కణజాలం విసర్జించబడుతుంది.
హాయిగా నిద్రిస్తారు. మంచి రాత్రినిద్ర పగలంతా మీకు ఉత్సాహం, ఆరోగ్యం కలిగిస్తుంది.
అరగంట బెడ్ లో కష్టపడితే 80 కేలరీలు డవున్! కనుక జిమ్ కి వెళ్ళి కఠిన వ్యాయామాలు చేసేకంటే, బెడ్ లో ఆనందిస్తే.... రెండు పనులూ అవుతాయి.
పురుషులలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ హార్మోన్లు, రిలీజ్ అవుతాయి. ఇవి పడకపై మంచి ఉత్సాహాన్నివ్వటమే కాక, కండరాలు, ఎముకలు మెరుగుపడేలా చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా వుంచుతాయి. కొల్లెస్టరాల్ నియంత్రిస్తాయి. మహిళలో రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ వారిని గుండె సంబంధిత వ్యాధులనుండి రక్షిస్తుంది. అంతేకాదు, వారి శరీరంలో చక్కని సువాసన వెదజల్లేలా చేస్తుంది.
ఇన్ని ప్రయోజనాలున్న రతిక్రీడను రోజూ ఆచరించి ఆనందించండి.