అయితే, నేటి రోజుల్లో టీనేజ్ వచ్చిందంటే చాలు కన్నెపొర లేదా హైమన్ దానంతటదే స్వల్ప ఒత్తిడికికూడా చినిగిపోవటం జరిగిపోతోంది. ఆమెకు తెలియకుండానే ఆ కన్నెపొర ఏదో ఒక సంఘటనలో తొలగిపోయే ఆస్కారం వుంది. యువతులు టీనేజ్ వచ్చిందంటే చాలు సైకిలింగ్, స్విమ్మింగ్, ఇతర ఆటలవంటివి చేస్తూ వుంటారు. లేదా జిమ్ ఇతర వ్యాయామాలు చేసి తమ శారీరక రూపాన్ని ఆకర్షణీయంగా చేసుకునే ప్రక్రియలో కూడా ఈ హైమెన్ పొర తొలగిపోయే అవకాశం వుంది.
ఈ కన్నెపొర సరైన రీతిలో వున్నదా లేక నలిగి చినిగిపోయిందా అనేది గైనకాలజిస్టులు పరీక్షలపై చెప్పగలరు. రతి ఆచరించకుండానే కూడా అది చినిగిపోయే అవకాశం వున్న కారణాన ఆమెను కన్యగానే పరిగణించాలి. ఈ కన్నెపొర విసర్జన లేదా ఆమె కన్యా కాదా అనే అంశంపై నిర్ధారించేందుకు నేటికి ఏ రకమైన రక్త పరీక్షలు లేవు. ఈ పరిస్ధితులలో కన్నెపొర లేనంత మాత్రాన ఆమె కన్య కాదు అనడం కూడా పొరపాటే.