భార్యా భర్తలు మొదటి రాత్రి ఒకరితో ఒకరు ఓపెన్ గా వుండాలంటూ తమ తమ కధలు వినిపించుకోవడం కూడా వుంటుంది. అయితే, ఒక్కొకపుడు ఈ రకమైన సంభాషణలు తప్పుదోవ పట్టి కలహాలు రేపడం కూడా వుంటుంది. అయితే, ఇద్దరికి గతంలో వేరు వేరుగా సంబంధాలుంటే వాటికి స్వస్తిచెప్పి తాజా జీవితం గడపాలనుకునేవారు కూడా లేకపోలేదు. ఈసంభాషణలలో నిజం లేకపోయినా, వారి మొదటి రాత్రి చేతల్లో వారికి రతిక్రీడలలో ఏపాటి అనుభవం వుందనేది ఒకరికొకరికి తెలిసిపోతూనే వుంటుందని, వారి గతం ప్రస్తుతానికి హాని చేయనంతవరకు ఎంత వెలిబుచ్చుకున్నా పరవాలేదంటారు విషయ నిపుణులు.
మొదటి రాత్రి భార్యకు కన్నెపొర అప్పటికే చిరిగింది. ఆమె చేతల్లో ఎంతో అనుభవం కనపడుతోంది. అయినప్పటికి కనీసం ఇద్దరిలోనూ ఎవరికో ఒకరికి మంచి అనుభవం వుందిలే అనుకునే పురుషులు కూడా లేకపోలేదు. ఆధునిక పోకడలలో ఏ రకమైన ప్రేమ లేకుండానే ఒక్క రాత్రి రతితో తమ కన్నెత్వాన్ని కోల్పోయిన మహిళలు కూడా వున్నారు. గతాన్ని మరవటం, ఆనందకరమైన భవిష్యత్తుకై చూడటం నేటి కొత్తగా వివాహాలైన జంటల సిద్ధాంతం. వీరిలో వచ్చిన మార్పుకు వారిని అభినందించాలి. ఒకసారి పెళ్ళి జరిగిందంటే, ఇక వారికి ప్రస్తుతం, భవిష్యత్తు మాత్రమే. మిగిలిన జీవితాలలో ఒకరికొకరు అంకిత భావంతో వుంటే చాలు. ప్రస్తుత, భవిష్యత్ జీవితాలు అద్భుత ఆనందంతో గడిస్తే చాలు.
ఆధునిక యువకులు, యువతులు, తమ భాగస్వాములు గతంలో ఎవరితో అఫైర్ జరిపినప్పటికి దానితో వివాహం తర్వాత సంబంధం లేదని ప్రస్తుతంలో ఒకరికొకరు ఆనందిస్తే చాలని భావించే స్ధితికి వచ్చేశారు. చాలామంది ఈ రకమైన ఆధునిక భావాలతో వున్నప్పటికి ఇంకా కొంతమంది యువత, కన్నెత్వాన్ని నైతికతలకు అంటగట్టి సాంప్రదాయంగానే వుండటానికి ప్రయత్నిస్తోంది. ఇటువంటి వారికి ప్రేమానురాగాలకంటే కూడా చిరగని కన్నెపొరకే ప్రాధాన్యతగా వుంది. కాలంతో పాటు వీరి భావాలు కూడా మారతాయని యువత జీవితాలు అభివృధ్ధి పధంలో సాగుతాయని ఆశిద్దాం.