అసలు జరిగేదేమిటి? వీర్యంలో మీ మూడ్ మార్చేసే రసాయనాలుంటాయి. వాటిలో టెస్టోస్టిరోన్, ఈస్టరోజన్, ప్రొలాక్టిన్, లూటీనిజింగ్, ప్రొస్టాగ్లాండిన్ హార్మోన్లు ప్రధానం. రతిక్రీడ మీ డిప్రెషన్ నయం చేయలేకపోయినా....అది ఈ రసాయనాలను యోని గోడల ద్వారా శరీరంలోకి పీల్చేసి మూడ్ మార్చేస్తుంది. సెక్స్ అనేది రంజింపజేస్తుంది. మానసికంగా మిమ్మల్ని తారాస్ధాయికి తీసుకు వెళుతుంది. అయితే, అది ఒక్కరితో మాత్రమే అయి వుండాలి. సురక్షిత రతి అయి వుండాలి. రీసెర్చి మేరకు కండోమ్ వాడని మహిళలో మనో వేదన ఉండదట.
తృప్తి అయిన రాత్రులకు, ఆనందానికి జవాబు సుఖవంతమైన రతిక్రీడ. ఇతర సాధనాలైన వ్యాయామం, మంచి స్నేహాలు, నవ్వులు, ప్రేమించిన వారి మధ్య సంభాషణలు, జర్నల్ వ్రాయటం లేదా ఏ ఇతర చర్య అయినా సరే దీనికి సాటి రాకపోవచ్చు. అయినప్పటికి వాటి ప్రయోజనాలు వాటికుంటాయి. ఏది ఏమైనప్పటికి మీరు చేసే రతి సురక్షితం, సుఖవంతం అయివుండాలి. అపుడే మానసికంగా, శారీరకంగా అమిత ఆనందం పొందగలరు. ఒక డాక్టర్ మీ ఆరోగ్యంపై ఇచ్చే ప్రశంసలకు మించిన ఆనందం మీకు మరేదీ వుండకపోవచ్చు.