•  

క్లయిమాక్స్ చేరటం కష్టంగా వుంటే?

Help! I'm unable to climax during Romance
 
పక్కనున్న ప్రేయసితో ఎన్ని గంటలైనా సరే కబుర్లతో కాలక్షేపం చేసేస్తారు కొందరు. కాని రతిక్రీడలో క్లయిమాక్స్ కు ఎలా చేరాలనేది వీరికి తెలియదు. ఎంతో ఇబ్బంది పడతారు. మరి అది వారి తప్పా లేక ఆ సమయంలోని పరిస్ధితి అటువంటిదా?

నేటికి మన సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే చాలు అభ్యంతరం పెడతారు. అదేదో అనకూడని, లేదా చెప్పకూడని విద్య అనుకుంటారు. ఆ విద్యను ప్రవేశ పెట్టినప్పటికి అది పరిశుభ్రత, మరియు లైంగిక వ్యాధుల వ్యాప్తి మొదలైన అంశాలుగా వుంటుంది. అంతేకాని ఆనందం, సుఖం, సంతోషం, కోరిక, ప్రేమ మొదలైనవి ఎవరూ చెపటం లేదు. భార్యా భర్తల ప్రేమ వారంతటవారే తప్పొప్పులతో నేర్చుకుంటారు. ఇక ఏ మాత్రం సాహసం చేయని బుద్దు టైప్ పార్టనర్ దొరికాడంటే, జీవితంలో కొత్త ఆనందాలు నేర్చుకోవడం అనేది వుండదు కదా... ఇక రతి సుఖాలు కరువైనట్లే. అటువంటపుడు మీరు మీ పార్టనర్ సరైన భంగిమలు ఆచరించటం లేదనే చెప్పాలి.

పురుషుడికి ఆనందం ఇచ్చే మహిళ శరీర భాగాలు ఎక్కడో ఆమెలో కప్పబడి వుంటాయి. పురుషుడు పూర్తి అవగాహన వుంటే గానీ ఆ ప్రదేశాలకు చేరి ఆమెను సుఖ పెట్టలేడు లేదా తాను సుఖ పడలేడు. అటువంటపుడు లైంగిక సమాచార పుస్తకాలు, వెబ్ సైట్లు వంటివి మహిళల శరీర భాగాలను గురించి తెలుసుకోడానికి పనికివస్తాయి. అతనికి సహకరించండి. మీ శరీరాన్ని అన్వేషించేందుకు తోడ్పడండి. ప్రత్యేకించి ఒక అద్దం ముందు నిలబడి మీ శరీరాన్ని ప్రదర్శించండి.

క్లయిమాక్స్ అనేది పక్కన పెట్టినా....జంటలు ఒకరికొకరు సహకరించుకొని ఆనందం పొందాలి. ఒకరంటే మరిఒకరికి అనుబంధం ఏర్పడాలి. అతను మీ కొరకు మీరు అతని కొరకు జీవిస్తున్నట్లు భావించాలి. అదే సమయంలో శారీరకంగా కూడా మీరు ఆనందం అనుభవించాలి. కొన్ని భంగిమలు సౌకర్యం కాకుంటే, మరికొన్ని ప్రయత్నించండి. మహిళలకు లూబ్రికేషన్ కు సహకరించే కొన్ని ప్లెజర్ క్రీముల వంటివి తప్పక వాడాలి. అవసరమనుకుంటే ఒక వైద్యనిపుణిడిని కూడా సంప్రదించండి. మీ పార్టనర్ కు అసౌకర్యంగా వుందా, నొప్పి వుందా అనే అంశాలు పరిశీలించాలి. సమస్యలు వుంటే వైద్య సలహా పొందాలి.

పైన తెలిపినవి ఏవీ మీకు వర్తించనపుడు, ఆనందపు అంచులు అందుకోటానికి ప్రయత్నిస్తూనే వుండండి. వెబ్ సైట్లు, వీడియోలు, పుస్తకాలు వంటి వాటిద్వారా, ఒక వ్యక్తిగత సలహాదారు ద్వారా పూర్తి సమాచారం సేకరించండి. ఇక అపుడు కూడా క్లయిమాక్స్ చేరటానికి ఏ మాత్రం సందేహించకండి.

English summary
No wonder, we learn only through trial and error about intimacy for couples. If we end up being with a partner who is not adventurous enough, we might just as well will die without ever experiencing anything. So it is very likely that you and your partner are not doing the right body motions.
Story first published: Thursday, March 1, 2012, 17:55 [IST]

Get Notifications from Telugu Indiansutras