సరైన శారీరక ఫిట్ నెస్ లేకపోవటం. వ్యాయామాలు చేయకపోవటం, జిమ్, యోగా వంటివి అభ్యసించకపోవటం వంటివి పురుషుడికి పడకగది మూడ్ కూడా పాడు చేస్తాయి. వారానికి మూడు సార్లు, ప్రతిసారి కనీసం ఒక గంట వ్యాయామం చేసిన పురుషులు, రతిక్రీడలో టాప్ అనిపించుకుంటున్నారని రీసెర్చర్లు వెల్లడించారు. పొగతాగే అలవాటుంటే, శరీర రక్తం త్వరగా వేడెక్కదు, ప్రవహించదు. కనుక అది మిమ్మల్ని ఆ పని సమయంలో మందంగా తయారు చేస్తుంది. పొగతాగే పురుషులకు అంగస్తంభన సరిగా వుండదనికూడా హెచ్చరిక చేయవచ్చు. ఇక మహిళలు పొగతాగే వారైతే రతిలో వారికి స్కలనం ఎపుడైందో కూడా తెలియని స్ధితి వచ్చేస్తుంది. నిజంగా రతిని ఆనందించాలనుకునేవారు సిగరెట్ కు దూరంగా వుండాలి.
మన పెంపుడు కుక్క - పెంపుడు కుక్క మనకో బెస్ట్ ఫ్రెండ్ అని భావిస్తాం. ఒకోప్పుడు సరైన సమయంలో ఇది అడ్డం వచ్చేసి కూర్చుంటుంది. ఇక భాగస్వామికి మిగిలేది అసంతృప్తి మాత్రమే. కుక్క మన నిద్ర పద్ధతిని కూడా మార్చేసి తద్వారా రతిక్రీడలో కూడా ఇబ్బందులు పెడుతుందంటారు డా. హెర్బెనిక్ . ఇక మన పెంపుడు పిల్లి, లేదా కుక్క రతిలో ఎదురుగా కూర్చొని చూస్తుంటే, వున్న మూడ్ కూడా ఖరాబే. అది కూడా అలవాటు పడిందంటే, మన రూమ్ వదిలి బయటకు పోదు. చూసినా, పూర్ ఫెలో మూగది ఎవరికి చెప్పలేదు కనుక దాన్ని సాధారణంగా వదిలేస్తూ వుంటాం.
పడకలో మూడ్ అవుట్ అవటానికి మరో సాధనం మన సెల్ ఫోన్ లేదా టెలిఫోన్. రతికంటే కూడా ఫోన్ కే ప్రాధాన్యం ఇచ్చే వారు చాలామందే వున్నారు. రతి మధ్యలో ఫోన్ మోగితే మరి అప్పటివరకు వున్న ఆవేశం స్ధాయి తగ్గి...ఆ ఫోన్ ఎవరినుండి వచ్చిందా? దాని ప్రాధాన్యత ఏమిటి వంటివి? ప్రశ్నార్ధకాలుగానే వుంటాయి. లేదా ఏ రకమైన కొత్త మెసేజ్ వచ్చినా తెలుసుకోవాలన్న కుతూహలం వుంటుంది. ఇక ఆపై పనికి రిలాక్స్డ్ గా వుండలేము. కనుక ఆ పనిలో మీరు కూల్ అయ్యేకంటే, మీ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఆనందించండి.