టీనేజ్ లో వచ్చే గర్భాలకు ఇతర వ్యాధులకు అధిక తాగుడు, తర్వాత చేసే రతిక్రీడలు కారణమని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ తెలుపుతున్నారు. వైద్యులవద్దకు గర్భనిరోధక సాధనాలకొరకు, మాత్రల కొరకు వచ్చిన టీనేజర్ల తాగుడు అలవాట్లగురించి ముందుగా విచారించాలని, ఆ అలవాట్లపై వారికి సరైన మార్గదర్శకతనిచ్చి తర్వాతే అవసరాన్నిపట్టి గర్భనిరోధక సాధనాలను అందించాలని వీరి నివేదిక తెలుపుతోంది.
14 నుండి 15 సంవత్సరాల బాలికలలో షుమారు అయిదొంతులమంది తాగిన మైకంలో త్వరబడి రతికి దిగిపోతున్నారట. 16 నుండి 30 సంవత్సరాల వయసున్న బాలికలలో సుమారు 80 శాతం మంది రతిక్రీడకు ముందే తాగుతున్నారని సర్వే చెపుతోంది. ప్రతి సంవత్సరం షుమారు పది లక్షలమందికి పైగా టీనేజర్లు సెక్స్వల్ హెల్త్ క్లినిక్ లకు ఉచిత గర్భ నిరోధక సాధనాలకు, మాత్రలకు లేదా సుఖవ్యాధుల చికిత్స, పరీక్షలు మొదలైన వాటికి వస్తున్నారని డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. ఆల్కహాల్ అమ్మకాలపై కఠిన నిబంధనలు, కొద్దిపాటి అధిక ధర, తాగుడు పట్ల అవగాహన పెంచటం వంటివి తప్పని సరిగా అధికం చేయాలనికూడా ఈ సర్వే చెపుతోంది.