సంతృప్తికర రతి మీ ఆయుష్షును పది సంవత్సరాలు అధికం చేస్తుందంటారు. వయసు ఏదైనప్పటికి ఆనందకరంగా ఆరోగ్యకరమైన రతి చేస్తే ఎంతో రిలీఫ్ గా వుంటుందనేది అందరకు తెలిసిందే. అయితే...ఎలా చేసినప్పటికి రతి అనేది చేస్తూ వుంటే అది జీవిత కాలాన్ని 8 సంవత్సరాలు పొడిగిస్తుందట. క్రమంతప్పకుండా ఆచరించే రతి శరీరంలో హార్మోన్ల స్ధాయి పెంచటం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడుకు పదును పెట్టటం, మన రోగనిరోధక వ్యవస్ధను పునరుజ్జీవం చేయటం వంటి ప్రయోజనాలు ఎన్నో కలిగిస్తుంది. కనుక ఆనందిస్తూనే, ఎప్పటికి యవ్వనవంతులుగా వుండవచ్చు.
ఎన్నిసార్లు రతి చేశారనేది కాదు కావలసింది. ఎంత తృప్తికరంగా చేస్తున్నారనేది లెక్కించబడుతుంది. ఒక స్టడీలో చక్కగా రతి చేసే వారికి రోగ నిరోధకత కణాలు 20 శాతం ఎదుగుదల చూపినట్లు తేలింది. మహిళలకు కూడా సుమారు 8 సంవత్సరాల జీవితకాలం పెరుగుతుందని చెపుతున్నారు. భావప్రాప్తి కలిగితే చాలు, ఎన్నో రసాయనాలు శరీరంలో ప్రేరేపించబడి, రిలీఫ్ కలుగుతుంది. అనుబంధం ఏర్పడుతుంది. కనుక వివాహమైన జంటలు ఆనందంగా వుండే వారు అనారోగ్య రతి జరిపేవారికంటే కూడా అధికంగా జీవిస్తారట. మహిళలకు వారానికి రెండుసార్లు భావప్రాప్తి జరిగితే, గుండె సంబంధిత సమస్యలు 30 శాతం తక్కువగా పొందుతారని కూడా తేలింది.
కనీసపక్షం అంటే, వారానికోసారి రతి చేస్తే మీలోని హార్మోన్లు, గుండె, మెదడు అన్ని ఖచ్చితంగా పని చేస్తాయి. ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రయోజనం. పురుషులు వారానికి మూడు లేదా అంతకంటే అధికంగా రతి చేస్తే, వారి గుండె పోటు సమస్యలను 50 శాతం వరకు రాకుండా చూసుకునే అవకాశం వుందట. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న రతి ఆటంకాలు లేకుండా ఆరోగ్యకరమైన రీతిలో క్రమం తప్పకుండా జరిపి ఆనందించేయండి.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
English summary
Everyone knows that good sex feels fabulous at any age. But what's not as well known is that a regular roll in the hay can also add up to eight years to your life expectancy. Not only that, but the more orgasms you have, the longer you can expect to live. Regular sex improves hormone levels, heart health and brain power and revs up your immune system - so you can hold on to your youth while you enjoy yourself.